ఎకనమిక్స్‌లో ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి అమెరికా ఆర్థికవేత్తలు పాల్ ఆర్ మిల్‌గ్రోమ్, రాబర్ట్ బి విల్సన్‌లను వరించింది. ఆర్థికశాస్త్రంలో వినూత్న ప్రయోగాలతో వేలం సిద్ధాంతం, కొత్త వేలం ప్రక్రియలు కనిపెట్టినందుకు గాను వీరికి నోబెల్ లభించింది. ఈ మేరకు స్వీడిష్ కమిటీ ప్రకటించింది. ఇంప్రూవ్‌మెంట్స్ ఇన్ ఆక్షన్ థియరీ అండ్ ఇన్నోవేషన్స్ ఆఫ్ న్యూ ఆక్షన్ ఫార్మట్స్‌ను రూపొందించిన వీరిద్దరికి ఆర్థికశాస్త్రంలో నోబెల్ అందిస్తున్నట్లు కమిటీ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట ఎన్నో రంగాల్లో వేలం ప్రక్రియలు ఉంటాయి. వీరిద్దరు వేలం సిద్ధాంతాన్ని మరింత సరళీకరించడంతో పాటు కొత్త పద్ధతులను కనిపెట్టారు. దీంతో విక్రయదారులు, కొనుగోలుదారులతో పాటు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం పొందుతున్నారని నోబెల్ కమిటీ ప్రకటించింది.

వీరిద్దరు స్టాన్‌ఫొర్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. మిల్‌గ్రోమ్ 1979లో స్టాన్‌ఫొర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తర్వాత అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరి, హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతిగా ఉన్నారు.
రాబర్ట్ బి విల్సన్ 1963లో హార్వార్డ్ వర్శిటీ నుంచి పట్టా అందుకున్నారు. మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఎకనమిక్స్‌లో 1969 నుండి నోబెల్ పురస్కారం అందిస్తున్నారు. ఇప్పటికి 51సార్లు ఈ అవార్డును ప్రకటించగా, 84 మంది ఆర్థికవేత్తలు పురస్కారం అందుకున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications