కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఎకనమిక్ సర్వే (ఆర్థిక సర్వే)ను లోకసభలో ప్రవేశ పెట్టారు. అనంతరం లోకసభ వాయిదా పడింది. శనివారం ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 నుంచి 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఆర్థిక సర్వే ఉద్యోగాల సృష్టిపై కూడా సూచనలు చేసింది.

చైనీస్ మోడల్ ద్వారా ఉద్యోగాల సృష్టి
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పించారు. భారత్‌లో ఉద్యోగ కొరతను తగ్గించడానికి లేదా ఉద్యోగాల్ని సృష్టించడానికి చైనా ఫార్మాలాను అనుసరించాలని పేర్కొంది. చైనీస్ గ్రోత్ మోడల్‌ను అనుసరించడం ద్వారా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది.

ఎగుమతుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు
ఎగుమతుల ద్వారా భారత దేశం సూపర్ వాణిజ్య పవర్‌గా ఎదగాలని, చైనాను ఉదాహరణగా తీసుకోవచ్చునని ఆర్థిక సర్వే తెలిపింది. 2001 నుంచి 2006 మధ్య లేబర్ ఇంటెన్సివ్ ఎగుమతుల ద్వారా చైనాలో ఏకంగా 70 మిలియన్ల ఉద్యోగాలు వచ్చాయని పేర్కొంది.

2030 నాటికి 6 శాతానికి ఎగుమతులు
ఎగుమతులు వృద్ధి చెందితే భారత్‌లో ఉద్యోగాల కల్పన పెరుగుతుందని ఎకనమిక్ సర్వే తెలిపింది. మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా భారత ఎగుమతుల మార్కెట్ 2025 నాటికి 3.5 శాతానికి, 2030 నాటికి 6 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.

చైనాను అనుసరించాలి
ఎగుమతుల పెరుగదల కారణంగా భారత్‌లో 1999 నుంచి 2011 మధ్య 8,00,000 ఉద్యోగాలు అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగానికి మార్చేందుకు దోహదపడ్డాయని ఈ సర్వే తెలిపింది. ఉద్యోగాల సృష్టిని పెంపొందించేందుకు భారత్.. చైనాను అనుసరించాలని సూచించింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు చైనా అనుసరిస్తున్న విధానాలు మన దేశంలో ప్రవేశ పెట్టాలని పేర్కొంది.

2030 నాటికి 8 కోట్ల ఉద్యోగాలు
ఆర్థిక ప్రగతి ముందుకు సాగాలంటే సేవా రంగాన్ని బలోపేతం చేయాల్సి ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. దీనికి ఉద్యోగ కల్పనే మార్గమని పేర్కొంది. ప్రపంచ ఎగుమతుల మార్కెట్లో భారత్ గణనీయ వృద్ధి సాధిస్తే 2025 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు, 2030 నాటికి 8 కోట్ల ఉద్యోగాల సృష్టి సాధ్యమని తెలిపింది. ఉద్యోగాల సృష్టికి చైనా కొన్ని అరుదైన విధానాలను రూపొందించుకుందని, దానిని సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొంది.

ఎగుమతుల లక్ష్యం సాధిస్తే..
ఎగుమతుల లక్ష్యాలు సాధించినట్లయితే 2025 నాటికి భారతదేశం నెట్ ఎగుమతులు 248 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని, దీని ద్వారా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు నాలుగింట ఒక వంతు సాధ్యమైనట్లే అని తెలిపింది. పారిశ్రామిక రంగాన్ని ఏకీకరించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి వీలుంటుందని పేర్కొంది. పారిశ్రామిక రంగంతో ముడిపడి ఉన్న ప్రతి విభాగాన్నీ ఏకీకరించాల్సిన అవసరం ఉందని, ఉత్పాదక రంగం, రవాణా రంగం, మార్కెటింగ్.. ఇలా వేర్వేరుగా విభజించడం వల్ల సూక్ష్మస్థాయిలో ఆశించిన ప్రయోజనాలు లభించట్లేదని, పారిశ్రామిక ఏకీకరణ వల్ల అవకాశాలు విస్తృతమౌతాయని పేర్కొంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications