ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో బాంబు పేల్చింది. టాప్ మేనేజర్లు సహా 20 వేల మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభించిన అమెజాన్.. కార్పొరేట్, టెక్నాలజీ పని చేస్తున్న సుమారు 10,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీనికి రెట్టింపు సంఖ్యలో పింక్ స్లిప్ ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా నివేదికల ప్రకారం రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ దెబ్బతో రానున్న రోజుల్లో అమెజాన్ ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వర్కర్లు, టెక్నాలజీ సిబ్బంది, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా రాబోయే నెలల్లో కంపెనీ అంతటా 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని అమెజాన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్థిక మాంద్యం, ఆదాయల క్షీణత నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తొలగించే ఉద్యోగులకు 24 గంటల ముందు నోటీసు జారీచేయడంతో పరిహార ప్యాకేజ్‌ను సెటిల్ చేయనున్నారు.

మెటా, ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు లేఆఫ్ స్ప్రీకి వెళ్లిన తర్వాత అమెజాన్ కూడా ఉద్యోగులను తొలగిస్తుందని న్యూయార్క్ టైమ్స్ నవంబర్ తెలిపింది. Amazon 20,000 మంది ఉద్యోగులను తగ్గించినట్లయితే.. కార్పొరేట్ సిబ్బందిలో 6 శాతం తొలగించినట్లు అవుతుంది. తొలగించాల్సిన ఉద్యోగుల సంఖ్యపై ఎటువంటి వివరాలను వెల్లడించకుండా తొలగింపులు జరుగుతున్నాయని నవంబర్ 17న CEO అయిన ఆండీ జాస్సీ ధృవీకరించారు. "మా వార్షిక ప్రణాళిక ప్రక్రియ కొత్త సంవత్సరం వరకు విస్తరించింది, అంటే నాయకులు సర్దుబాట్లు చేస్తూనే ఉన్నందున మరిన్ని ఉద్యోగాల తొలగింపులు ఉంటాయి" అని జాస్సీ పబ్లిక్ సందేశంలో రాశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications