బంగారం కొనుగోలుదారులకు కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్మలమ్మ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 12.5 శాతం నుండి 7.5 శాతానికి తగ్గించారు. ఇది కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతాయి. దీంతో పాటు కస్టమ్ డ్యూటీ 12.5 శాతం ఉండేది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి 7.5 శాతం పడనుంది. అంటే ఇక్కడి భారం కాస్త తగ్గుతుంది.

కస్టమ్ డ్యూటీ తగ్గింపు-ఇలా ప్రభావం
2021-22 కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో దేశంలోకి అక్రమ బంగారం రవాణా తగ్గుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేస్తోంది. తద్వారా ప్రభుత్వ ఆదాయం కాస్త మెరుగవుతుందని ఓ నివేదికలో పేర్కొంది. సుంకం తగ్గింపు దీర్ఘకాలికంగా వివిధ రంగాల డిమాండుకు తోడ్పడుతుందని, ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో ఆభరణాల ఖర్చులు తగ్గుతాయని, కస్టమర్ల కొనుగోలు శక్తి మెరుగు పడుతుందని అంచనా వేసింది. కొనుగోలుదారులపై భారం తగ్గడంతో పాటు రిటైలర్లకు కొనుగోళ్లు పెరిగే అవకాశాలు ఉంటాయి.

వారికి ప్రయోజనం
ఆదాయాన్ని పెంచే లక్ష్యంలో భాగంగా 2019లో బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుండి 12.5 శాతానికి పెంచారు. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనాల ప్రకారం బంగారం దిగుమతులు FY20లో అనధికారికంగా 150 టన్నుల నుండి 180 టన్నుల మధ్య ఉన్నాయి. అధికారిక బంగారం దిగుమతులు 600 టన్నుల నుండి 700 టన్నుల మధ్య ఉంది. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల దేశీయ వ్యవస్థీకృత జ్యువెల్లరీ దుకాణాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.

ఆదాయం పెరుగుతుంది
ఈ చర్య ప్రభుత్వ ఆదాయాన్ని కూడా మెరుగుపరుస్తుందని వెల్లడించింది. ఆభరణాల ఖర్చులు తగ్గడం వల్ల దీర్ఘకాలిక రంగాల డిమాండుకు తోడ్పడుతుంది. వినియోగదారుల్లో కొనుగోలు సెంటిమెంట్ పెరుగుతుంది. కరోనా కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో డిమాండ్ తగ్గినప్పటికీ, రెండో అర్ధ సంవత్సరంలో పండుగలు వంటి ప్రభావంతో పెరిగింది.
More From GoodReturns

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications