Philips: 90లలో పుట్టిన వారి నుంచి నేటి తరం వారికి సైతం పరిచయం ఉన్న కంపెనీ ఫీలిప్స్. ఇదొక డచ్ కంపెనీ. దశాబ్ధాలుగా భారత్ లో నిరాటంకంగా కంపెనీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అయితే ఇప్పుడు దీనికి వచ్చిన కష్టం వల్ల ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. అసలు కంపెనీకి భారీగా నష్టాలు రావటానికి గల కారణం ఏమిటో చూద్దాం.

కంపెనీ వ్యాపారం..
సాధారణంగా మనందరికీ ఫిలిప్స్ గృహోపకరణాలు, ఎలక్ట్రికల్స్, లైటింగ్ వంటి వస్తువులను అమ్ముతుందని తెలుసు. అయితే ఈ కంపెనీ ఎక్కువగా వైద్య పరికరాలను తయారు చేయటంలో ఫేమస్. అయితే ప్రస్తుతం కంపెనీ 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. కంపెనీకి భారీగా నష్టాలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో వ్యాపారం చేస్తున్న ఈ కంపెనీకి దాదాపు 80,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

నష్టాలు తెచ్చింది ఇదే..
స్లీప్ అప్నియా ఉన్న వినియోగదారుల కోసం స్లీప్ రెస్పిరేటర్లను తయారు చేసింది. అయితే ఈ పరికరాలు లోపభూయిష్టంగా ఉండటం వల్ల కంపెనీ దాదాపు 1.3 బిలియన్ యూరోల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది కంపెనీకి భారీ ఆర్థిక నష్టం అని చెప్పుకోవాలి. మునుపటి సీఈవో 12 ఏళ్లు కంపెనీని ఎలక్ట్రానిక్స్ నుంచి వైద్య పరికరాల తయారీదారుగా మార్చిన తర్వాత ఈ ఏడాది పదవీవిరమణ చేశారు. ఇప్పటికే కంపెనీ లోపభూయిష్ట పరికరాల నష్టాన్ని పూడ్చేందుకు 900 మిలియన్ యూరోలను కేటాయించింది.

చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట..
ప్రస్తుతం కంపెనీ పనితీరును మెరుగుపరచటం తన ముందు ఉన్న ప్రధమ కర్తవ్యవమని కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాయ్ జాకోబ్స్ అన్నారు. దీనివల్ల తాము వేగంగా రోగులు, వినియోగదారులు, కస్టమర్లతో పాటు ఇతర వాటాదారుల నమ్మకాన్ని పునర్నిర్మించడం ప్రారంభించగలమని చెప్పారు. వాటాదారులందరికీ విలువ సృష్టించేందుకు అనుగుణంగా కంపెనీ పనితీరును మార్చటానికి, లాభదాయకతను పెంచటానికి తాను కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

గత ఏడాది లాభాలు..
ఫిలిప్స్ గత ఏడాది మూడవ త్రైమాసికంలో 3 బిలియన్ యూరోల నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే ప్రస్తుతం అమ్మకాలు తగ్గటానికి సరఫరా గొలుసు వ్యవస్థలో సమస్యలు కారణమని కంపెనీ తెలిపింది. దీనికి తోడు అతర్జాతీయంగా ఉన్న ఒత్తిళ్తు, రాజకీయ పరిణామాలు, ఆర్థిక మందగమనం వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కంపెనీ వెల్లడించింది. అందువల్లే మెుత్తం ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించాల్సి వచ్చినట్లు స్పష్టం చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications