డాక్టర్ రెడ్డీస్ కంపెనీ మరో అరుదైన ప్రాజెక్టు చేపట్టనుంది. జర్మనీకి చెందిన నింబస్ హెల్త్ కొనుగోలు చేసుకోనుంది. ఈ మేరకు డెఫినిటివ్ అగ్రిమెంట్కుదుర్చుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ మేరకు ప్రకటించింది. లైసెన్సెడ్ ఫార్మా హోల్ సేలర్ గంజాయి ఆధారిత డ్రగ్స్‌పై ఫోకస్ చేస్తోంది. ఈ డీల్ విలువను డాక్టర్ రెడ్డీస్ వెల్లడించలేదు.
నింబస్ తమ చేతికి రావడం వల్ల గంజాయి ఆధారిత మెడిసిన్స్‌ను పేషెంట్లకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. సాధారణ మందులతో నయం కాని చాలా రోగాలకు గంజాయిని ట్రీట్మెంట్గా వాడుతున్నారని వివరించింది. ముఖ్యంగా నొప్పులను తగ్గించడంలో ఈ రకం ట్రీట్మెంట్ బాగా పనిచేస్తాయని డాక్టర్ రెడ్డీస్ యూరోపియన్ జెనరిక్స్ హెడ్ పాట్రిక్ అఘానియన్ చెప్పారు.

నింబస్ తమకు హోల్లీ ఓన్డ్ సబ్సిడరీగా ఉంటుందని చెప్పారు. దీంతో కంపెనీకి మేలు జరుగుతుందని పేర్కొంది. జర్మనీలో మెడికల్ గంజాయి మార్కెట్ విలువ గత ఏడాది 122 మిలియన్ యూరోలుగా రికార్డయింది. ఈ సారి మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇటు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కోవిడ్ మహమ్మారిని నిర్మూలించేందుకు తక్కువ ఖర్చుతో మెరుగైన ట్రీట్‌మెంట్‌ను అందించేందుకు డాక్టర్ రెడ్డీస్ మోల్ ప్లూ పిల్స్‌ను ప్రవేశపెట్టింది. భారత్‌కు 100కి పైగా పేద, మధ్య స్థాయి దేశాలకు మోల్నుపిరవిర్‌ను తయారు చేసి, సరఫరా చేసేందుకు మెర్క్ షార్ప్ డోమ్‌తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మా, ఎంక్యూర్, టోరెంట్ ఫార్మా, వైట్రిస్ కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ ఆధ్వర్యంలో కన్సార్షియంగా ఏర్పడి ఐదు నెలల పాటు దీనిపై పరీక్షలు నిర్వహించాయి. భద్రతను, సమర్థతను పరీక్షించిన తర్వాత మార్కెట్‌లోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications