గుడ్‌న్యూస్: నష్టాలతో నిలిచిన ట్రేడింగ్, నేడు భారీ లాభాల్లో మార్కెట్లు

మార్కెట్లు కుదురుకుంటున్నాయి. యూఎస్ ఫ్యూచర్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రపంచ మార్కెట్లో కరోనా విలయం తర్వాత ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఎగిసింది. డౌ ఫ్యూచర్స్ ఏకంగా 600 పాయింట్లు జంప్ అయింది. ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్ 100 పాయింట్ల చొప్పున ఎగిసింది. 1987 మార్కెట్ క్రాష్, 2008లో ఆర్థిక సంక్షోభం అనంతరం అమెరికా మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను చవి చూశాయి. ఇప్పుడు కోలుకుంటున్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లోకి రావడంతో భారత మార్కెట్లపై కూడా ఈ ప్రభావం పడుతుంది. అంతకుముందు సెషన్లలో మాత్రం భారీ నష్టాలు చూశాయి.

తొలి రోజు మార్కెట్లకు ఊతమివ్వని ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు

తొలి రోజు మార్కెట్లకు ఊతమివ్వని ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు

నిన్నటి వరకు కరోనా దెబ్బకు అమెరికా సహా ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు శనివారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించింది. కానీ సోమవారం మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ విక్రయాలు భారీగా పడిపోయాయి. అమెరికా, బ్రెజిల్, గల్ఫ్ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి.

ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాల్లో...

ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాల్లో...

సోమవారం భారీ నష్టాల కారణంగా అమెరికా వాల్‌స్ట్రీట్ విరామం తీసుకుంది. కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా అన్నీ క్లోజ్ కావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత కూడా భయపెట్టింది. ప్రధాన ఐరోపా మార్కెట్లు ఎనిమిది శాతం వరకు పడిపోయాయి. ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. చైనా 3.40%, హాంగ్ కాంగ్ 4.03%, దక్షిణ కొరియా 3.19%, జపాన్ 2.46% నష్టపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్ బ్యారెల్ ధర 7.53% క్షీణించి 31.30 డాలర్లకు చేరుకుంది.

అమెరికా, బ్రెజిల్‌‌లో నిలిచిన ట్రేడింగ్

అమెరికా, బ్రెజిల్‌‌లో నిలిచిన ట్రేడింగ్

అమెరికా స్టాక్ మార్కెట్లలో సోమవారం ప్రారంభంలోనే 15 నిమిషాలు ట్రేడింగ్ నిలిచిపోయింది. అనంతరం మార్కెట్లు తిరిగి ప్రారంభమైనా నష్టాల్లోనే ముగిశాయి. కానీ మరుసటి రోజు లాభాల్లో ట్రేడ్ అవుతుండటం గమనార్హం. బ్రెజిల్ సావోపాలో స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 12.5% కోల్పోవడంతో కాసేపు ట్రేడింగ్ నిలిచింది.

గల్ఫ్ మార్కెట్లూ నష్టాల్లోనే..

గల్ఫ్ మార్కెట్లూ నష్టాల్లోనే..

గల్ఫ్ దేశాల్లో కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలబాటలో ఉన్నాయి. ముడిచమురు ధరల్లో క్షీణత వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. అబుదాబీ, దుబాయ్ ఎక్స్ఛేంజీలు వరుసగా 7.8%, 6.2% క్షీణించాయి. బౌర్సా కువైట్ ప్రీమియర్‌ ఇండెక్స్ 5.0%, ఆల్ షేర్స్ ఇండెక్స్ 3.9%, సౌదీ తడావుల్‌ మార్కెట్‌ సూచీ 3.3% క్షీణించాయి. గల్ఫ్ మార్కెట్లు అన్నీ నష్టపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+