For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనవసర ఫోన్ కాల్స్‌పై 'దూస్రా', రూ.700తో సబ్‌స్క్రైబ్: హైదరాబాద్ కంపెనీ కంపెనీ యాప్

|

మొబైల్ ఫోన్‌కు వచ్చే స్పామ్ కాల్స్‌ను నిరోధించడంతో పాటు, గోప్యతకు భంగం కలగకుండా 10 అంకెల డిజిట్, సిమ్ అవసరంలేని మొబైల్ నెంబర్‌ను టెన్20 ఇన్ఫోమీడియా తీసుకు వచ్చింది. పర్సనల్ మొబైల్ నెంబర్‌ను పేర్కొనాల్సిన చోట కస్టమర్లు తమ అసలు నెంబరుకు బదులు, ఈ దూస్రా నెంబరును చెబితే సరిపోతుంది.

ఎక్కడైనా షాపింగ్‌కు వెళ్లినప్పుడు మొబైల్ నెంబర్ అడగడం సహజం. ఇలా ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు ఆ తర్వాత పెద్ద ఎత్తున స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తాయి. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు మన ఫోన్ నెంబర్ ఇవ్వకుడా, మరో నెంబర్ ఇచ్చి తద్వారా మన ఫోన్‌కు వచ్చే కాల్స్‌కు తర్వాత మనమే కాల్ చేసే కొత్త సదుపాయం ఇది.

కార్డు లేకుండా వాచీతో పేమెంట్స్ చేయండి: ఎలా పని చేస్తుంది, ధర ఎంత?కార్డు లేకుండా వాచీతో పేమెంట్స్ చేయండి: ఎలా పని చేస్తుంది, ధర ఎంత?

Doosra phone number that promises freedom from spammers

దూస్రా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, సబ్‌స్క్రైబ్ చేస్తే 10 అంకెల నెంబర్ ఇస్తారు. ఈ యాప్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎక్కడైనా మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దూస్రా నెంబర్ ఇస్తే సరిపోతుంది. దూస్రా యాప్‌లో సెట్టింగ్స్ ద్వారా నెంబర్‌కు వచ్చే కాల్స్ బ్లాక్ కావడం లేదా వాయిస్ మెయిల్‌కు బదలీ కావడం అవుతుంది. ఈ సేవలు పొందడానికి ఏడాదికి రూ.700 చెల్లించాలి.

ఆన్‌లైన్ వెబ్ సైట్లు, షాపింగ్ మాల్స్ వంటి వాటిల్లో ఈ దూస్రాను పేర్కొనవచ్చునని సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో ఆదిత్య అన్నారు. దూస్రా నెంబర్‌కు వచ్చే అన్ని కాల్స్, మెసేజ్‌లను తీరికవేళలో యాప్‌లో చూసుకోవచ్చునని తెలిపారు. మన మొబైల్ నెంబర్‌కు బ్యాంకింగ్ అకౌంట్, ఐడీ కార్డు వంటి ముఖ్యమైనవి అనుసంధానమై ఉంటాయని, సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయని, దూస్రాతో దీనిని అడ్డుకోవచ్చునని చెప్పారు.

English summary

అనవసర ఫోన్ కాల్స్‌పై 'దూస్రా', రూ.700తో సబ్‌స్క్రైబ్: హైదరాబాద్ కంపెనీ కంపెనీ యాప్ | Doosra phone number that promises freedom from spammers

Whenever we go shopping, we are forced to provide our mobile numbers. These numbers go in bulk to marketing agencies, who keep bombarding us with spam mails.
Story first published: Friday, September 18, 2020, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X