అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే పలు దేశాలపై భారీ సుంకాలను విధించిన ట్రంప్..మిత్రుడు అంటూనే భారతదేశానికి పెద్ద షాక్ ఇచ్చాడు. ఏకంగా 25 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. తాజాగా మరో బాంబు పేల్చారు. భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఔషధాలపై 250 శాతం వరకు దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయాన్ని మంగళవారం CNBCకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు.
ప్రస్తుతం అమెరికాలో ఔషధ దిగుమతులపై తక్కువ పన్నే అమలులో ఉన్నప్పటికీ.. ట్రంప్ ఈ పన్నులను రెండు దశలలో పెంచే యోచనలో ఉన్నట్లు ఆ ఇంటర్య్వూలో వెల్లడించారు. మొదట 150 శాతానికి, ఆపై 250 శాతానికి పెంచుకుంటూ వెళతామని స్పష్టం చేశారు. ఫార్మా దిగుమతులపై ఈ విధంగా భారీ సుంకాలు విధించే ప్రతిపాదన అమెరికాలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రయత్నంగా ట్రంప్ అభివర్ణించారు.

ఇండియా ప్రపంచానికి జనరిక్ ఔషధాల ప్రధాన సరఫరాదారుగా ఉంది. అమెరికా ఫార్మా మార్కెట్‌లో భారతదేశానికి అత్యంత ముఖ్యమైన వాటా ఉంది. ఈ నేపథ్యంలో 250 శాతం పన్ను అమలయితే అమెరికాలో భారత ఫార్మా కంపెనీల వ్యాపారంపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది మందుల ధరలను గణనీయంగా పెంచే అవకాశం అయితే లేదు కాని సరఫరా గొలుసు అంతరాయం ఏర్పడుతుంది. కంపెనీల R&D పై వ్యయం తగ్గుతుంది. అలాగే అమెరికా లోపల రోగులకు ఔషధం అందుబాటులో ఉండటం చాలా కష్టంగా మారుతుంది.
డొనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో.. అమెరికన్ ఫార్మాస్యూటికల్ లాబీలు, పరిశ్రమ సంఘాలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధమైన విధానాలు పెట్టుబడులను ఆపేస్తాయని చెబుతున్నారు. అలాగే ఔషధాలను ఖరీదైనవిగా మార్చతాయని అంటున్నారు. ఆ నిర్ణయాలు వినియోగదారులకు నష్టం కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
జూలైలో ఫార్మాపై 200 శాతం టారిఫ్ విధించాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన హెచ్చరికలు చాలాసార్లు అమలవు కాలేదని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్‌కు పెద్ద సంకేతాలను ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఫార్మా సంస్థలు ఇప్పటినుంచే తమ వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏప్రిల్‌లో ట్రంప్ పరిపాలన విభాగం ఔషధ దిగుమతులపై సెక్షన్ 232 దర్యాప్తును ప్రారంభించింది. ఇది అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా అవుతాయా? అనే దానిపై అధ్యయనం చేస్తుంది. దీని ఫలితంగా టారిఫ్‌లు విధించడమే కాకుండా.. ఔషధాల్లో విదేశీ ఆధారాన్ని తగ్గించి స్థానిక తయారీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది ట్రంప్ మిషన్ గా తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే.. ట్రంప్ అధికారంలోకి వస్తే ఫార్మా రంగంపై గణనీయమైన ప్రభావం ఉంటుందని, ఫార్మా కంపెనీలు ఇప్పటికే తమ వ్యూహాలు, పెట్టుబడులను తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. 250 శాతం టారిఫ్ విధించబోతున్నామన్న హెచ్చరిక ఎంత వరకు అమలవుతుందో వేచి చూడాల్సిందేనని వారు చెబుతున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications