Trump News: ఇండియాను క్షమించిన ట్రంప్.. పూర్తి వివరాలివే..
Donald Trump Tariffs: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవ సారి విక్టరీని ఖాతాలో వేసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల విషయంలోని డైనమిక్స్ పూర్తిగా మారిపోబోతున్నాయి. చాలా కాలంగా ట్రంప్ గెలిస్తే సుంకాలు పెరుగుతాయనే ఆందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో భారత్ పెద్ద శుభవార్తను అందుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రజలకు తిరిగి ప్రాధాన్యతను అన్ని విషయాల్లో కల్పించేందుకు ప్రస్తుతం ట్రంప్ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా నుంచి అమెరికాలోకి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలను విధిస్తానని హామీ ఇచ్చారు. అక్రమ వలసలు, అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం అరికట్టాలని ట్రంప్ చూస్తున్నారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, జనవరి 20న వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టనున్న వేళ.. చైనా, మెక్సికో, కెనడాపై సుంకాలను విధించే ప్రణాళికలతో పాటు తయారీ రంగాన్ని ప్రోత్సహించటం ద్వారా ఉద్యోగాలను తిరిగి తీసుకురావడానికి అతని పరిపాలన సుంకాలను ఉపయోగించడం కొనసాగిస్తుందని సూచిస్తుంది. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే.. ట్రంప్ ప్రారంభ టారిఫ్ ప్లాన్‌లలో భారతదేశం పేరు కనిపించలేదు.

వాస్తవానికి అమెరికా-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు బలంగా కొనసాగటానికి టారిఫ్ రేట్ల పెంపు విషయంలో ట్రంప్ అందిస్తున్న వెసులుబాటు ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో కెనడా, మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం, చైనాపై అదనంగా 10 శాతం ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదిత సుంకాలు US-మెక్సికో-కెనడా ఒప్పందాన్ని సవాలు చేస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ మూడు దేశాల మధ్య ఎలాంటి పన్ను లేకుండా ఫ్రీ ట్రేడ్ చేసుకోవటం కోసం 2020లో ట్రంప్ సంతకం చేసిన వాణిజ్య ఒప్పందం కావటం గమనార్హం. 83% మెక్సికన్ ఎగుమతులు, 75% కెనడియన్ ఎగుమతులు 2023లో కేవలం అమెరికాకు వెళ్లాయని గణాంకాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా మెక్సికో, చైనా, కెనడాలు ట్రంప్ నాయకత్వంలో సంభావ్య విధాన మార్పులకు ఎక్కువగా గురవుతాయి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ప్రకారం అమెరికాతో ఈ దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సమతుల్యత ఆధారంగా దేశాలకు ర్యాంక్ ఇస్తుంది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ జాబితాలో భారత్ 8వ స్థానంలో ఉంది. జనవరి 20న మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో ఒకటిగా, మెక్సికో- కెనడా నుండి యునైటెడ్ స్టేట్స్‌లోకి వచ్చే అన్ని ఉత్పత్తులపై 25% సుంకం విధించడానికి అవసరమైన అన్ని పత్రాలపై సంతకం చేస్తానని ట్రంప్ చెప్పటంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. డ్రగ్స్, ముఖ్యంగా ఫెంటానిల్, అక్రమ వలసదారులు అమెరికాపై దాడి చేయడం ఆపే వరకు ఈ సుంకం అమల్లో ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ సైతం అమెరికా అధ్యక్ష మార్పులతో ఎదురయ్యే సవాళ్ల గురించి అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications