Financial Planning: RBI నెలలోపే రెపో రేటును రెండుసార్లు పెంచింది. 8 ఏళ్ల రికార్డు స్థాయికి చేరుకున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని విడతల వారీగా ఈ పెంపు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా మీ లోన్ EMI పెరుగుతుంది. ఇప్పటికే దేశంలోని చాలా బ్యాంకులు పెరిగిన రెపో రేటుకు అనుగుణంగా తమ వడ్డీ రేట్లను పెంచాయి. రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకులు కూడా ఇదే బాటలో ముందుకు సాగనున్నాయి. దీంతో పాటు బ్యాంకులు డిపాజిట్ రేట్లను సైతం పెంచుతున్నాయి. వడ్డీ రేట్ల పెరుగుదల రుణాలు తీసుకునే వారిని, డబ్బు పొదుపు చేసుకునే వారిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రేటు పెరిగితే లోన్ EMI వాయిదాలు పెరుగుతాయి:
మీ లోన్ ఫ్లోటింగ్ రేట్‌లో ఉన్నట్లయితే.. వడ్డీ రేటు పెరుగుతుంది. ఇది లోన్ కాలవ్యవధిని పెంచుతుంది. ఇది దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ రేట్ల పెంపు ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీరు 20 సంవత్సరాల కాలవ్యవధికి 7% వడ్డీ రేటుకు లోన్ తీసుకున్నట్లయితే.. ప్రతి 25 బేసిస్ పాయింట్ల పెరుగుదలకు లోన్ చెల్లింపు కాలం 10 నెలలు పెరుగుతుంది. ఇప్పటి వరకు రిజర్వు బ్యాంక్ రెపో రేటును రెండు విడతలుగా 90 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మీ హోమ్ లోన్‌లో మీకు 19 సంవత్సరాలు మిగిలి ఉండి రేటు 75 బేసిస్ పాయింట్లు పెరిగినట్లయితే.. మీరు మరో 30 EMIలు అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. షార్ట్ టర్మ్ లోన్స్ విషయంలో ఈ ప్రభావం కొంత తక్కువగానే ఉంటుంది.

కాలవ్యవధి పెరగకూడగంటే ఇలా చేయండి:
మీ హోమ్ లోన్ కాలపరిమితి పూర్తవుతున్నట్లయితే.. మీరు రేట్ల పెంపుపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లోన్ పదవీకాలాన్ని పొడిగించకూడదనుకుంటే.. మీరు ఒకేసారి చెల్లింపు చేయవచ్చు లేదా EMIని పెంచమని సదరు ఫైనాన్స్ సంస్థను రిక్వెస్ట్ చేయవచ్చు. వడ్డీ రేటు 7 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగిందనుకుంటే.. మునుపటి లోన్ కాలాన్ని కొనసాగించడానికి అదనంగా ప్రతి లక్ష రూపాయలకు దాదాపు రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల చెల్లించాల్సిన ఈఎంఐ మాత్రమే పెరుగుతుంది, కాలవ్యవధి కాదు.

ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు మంచి కాలం:
వడ్డీ రేట్ల పెంపు రుణాలు తీసుకునే జేబులపై ప్రభావం చూపుతుంది. కానీ.. ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు వడ్డీ రేట్ల పెంపు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. బ్యాంకులు డిపాజిట్ రేట్లను పెంచడం ఇప్పటికే ప్రారంభించాయి. అంటే.. ఇన్వెస్టర్లకు అధిక రాబడి లభిస్తుంది. వడ్డీ రేట్లు పెరగడం వల్ల ప్రభుత్వ బాండ్ రాబడులు కూడా పెరిగాయి. ఇది చిన్న పొదుపు పథకాల రేటు పెంపుకు కూడా దారి తీస్తుంది. ప్రతి క్వార్టర్ లో వీటి వడ్డీ రేట్లు మారుతుంటాయి. 2020-21లో ప్రభుత్వ బాండ్ రాబడులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ రాజకీయ కారణాల వల్ల.. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం తప్పించింది. PPFపై ప్రస్తుతం రేటు 7.1 శాతం ఉండగా.. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇది 7.4 శాతంగా ఉంది. ఈ నెలాఖరులోగా ఈ పొదుపు పథకాల వడ్డీ రేట్లు మారవచ్చని తెలుస్తోంది.

పెరుగుతూనే ఉన్న బాండ్ ఈల్డ్స్:
గత 18 నెలల్లో బాండ్ ఈల్డ్స్ స్థిరంగా పెరగడం డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై ప్రభావం చూపింది. జనవరి 2021లో 5.8 శాతంగా ఉన్న బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్.. ఇప్పుడు 7.5 శాతానికి పెరిగింది. బాండ్ రాబడులు పెరిగినప్పుడు.. బాండ్ విలువ తగ్గుతుంది. దీనివల్ల బాండ్ ఫండ్స్, ఎన్‌పిఎస్ ఫండ్స్ ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఆర్‌బీఐ రెపో రేటును మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే బాండ్ ఈల్డ్ మరింత పెరుగుతాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు రేటు పెంపు వల్ల పెద్దగా ప్రభావితం కానందున షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తు్న్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications