DOMS ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) 13 డిసెంబర్ 2023న అంటే వచ్చే వారం బుధవారం ప్రైమరీ మార్కెట్‌కు రాబోతోంది. ఈ పబ్లిక్ ఇష్యూ 13 డిసెంబర్ 2023న ప్రారంభమై 15 డిసెంబర్ 2023 ముగుస్తుంది. డోమ్స్ పెన్సిల్ తయారీదారు సంస్థగా ఉంది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.750 నుంచి రూ.790 గా నిర్ణయించారు. స్టేషనరీ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.1200 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ రూ.1200 కోట్లలో రూ.350 కోట్లు తాజా షేర్ల జారీ లక్ష్యం కాగా మిగిలిన రూ.850 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) మార్గం కోసం రిజర్వ్ చేశారు.భారత స్టాక్ మార్కెట్‌లో బలమైన సెంటిమెంట్‌ల నేపథ్యంలో గ్రే మార్కెట్‌లో DOMS ఇండస్ట్రీస్ షేర్ ధర ఆకాశాన్ని తాకింది. స్టాక్ మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం డోమ్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈరోజు గ్రే మార్కెట్‌లో రూ.470 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి. డోమ్స్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) శుక్రవార రూ.470 అని మార్కెట్ పరిశీలకులు అంచనా వేశారు.

ఇది మంగళవారం జీఎంపీ రూ.195 నుంచి రూ.300 ఎక్కువ. దలాల్ స్ట్రీట్‌లో బుల్లిష్ సెంటిమెంట్లను అనుసరించి డోమ్స్ ఐపీఓ పుంజుకుందని మార్కెట్ పరిశీలకులు పేర్కొన్నారు. వచ్చే వారం కూడా దలాల్ స్ట్రీట్‌లో బుల్ ట్రెండ్ కొనసాగితే DOMS IPOకు బలమైన స్పందన లభిస్తుందని వారు భావిస్తున్నారు. ఈ ఐపీఓ తప్పనిసరి T+3 లిస్టింగ్ నియమాలతో ప్రారంభమయ్యే మొదటి మెయిన్‌బోర్డ్ ఐపీఓగా వస్తోంది.
డిసెంబర్ 18న డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ షేర్లు కేటాయింపు ఉండనుంది. డోమ్స్ డిసెంబర్ 20న BSE, NSEలలో లిస్ట్ కానుంది. డోమ్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది గుజరాత్‌లోని వల్సాద్‌లో ఉన్న భారతీయ స్టేషనరీ మరియు ఆర్ట్ మెటీరియల్స్ తయారీ సంస్థ. 1976లో రసిక్‌లాల్ అమృత్‌లాల్ రవేషియా, మన్సుఖ్లాల్ జమ్నాదాస్ రజనీచే R.R. ఇండస్ట్రీస్ అనే భాగస్వామ్య సంస్థగా కంపెనీ స్థాపించారు. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ "DOMS"ను 2005లో ప్రారంభించింది. కంపెనీ భారతదేశపు 'స్టేషనరీ మరియు ఆర్ట్' ఉత్పత్తుల మార్కెట్‌లో ప్రముఖ ప్లేయర్, బ్రాండ్‌తో సంపూర్ణ సృజనాత్మక ఉత్పత్తుల సంస్థగా ఉంది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications