దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులను తిరగారాస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత ఐదు రోజులు వరుసగా దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాలు జోరు కొనసాగుతోంది. బుల్ రేస్ లో దూసుకుపోతోంది. బడ్జెట్ ఇచ్చిన బూస్ట్ తో పాటుగా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సపోర్టుతో దేశీయ స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. వరుసగా ఐదో రోజు కూడా చారిత్రకమైన రికార్డు సృష్టించింది. ఇక ఈ జోష్ ఇలాగే కొనసాగుతుందా.. జైత్రయాత్ర కంటిన్యూ అవుతుందా అన్నది ప్రస్తుతం అందరూ ఆలోచిస్తున్న అంశం.

మార్కెట్ జోరు ఎంత కాలం ? జోష్ లో ఉన్నా ఒకింత భయం
సెన్సెక్స్ 51 వేల మార్కును అధిగమించింది, అటు నిఫ్టీ సైతం 15 వేల మార్కును క్రాస్ చేసింది. అయితే ఈ జోరు ఇలానే కొనసాగుతుందా ? ఎక్కువ రోజులు నిలబడుతుందా అనేది ప్రస్తుతం ఇన్వెస్టర్ల ముందున్న ప్రశ్న. దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నాటి ట్రేడింగ్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ వరుసగా ఐదో రోజూ లాభాల్లోనే ముగిసింది. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగించడంతో రికార్డు స్థాయి లాభాల్లోకి వెళ్లిన సూచీలు, కాస్త తగ్గి సాధారణ లాభాలకు పరిమితమయ్యాయి.

చారిత్రక రికార్డులు సృష్టిస్తున్న ఇన్వెస్టర్ ల సంపద
మొత్తానికి 450 పాయింట్లు పెరిగి సెన్సెక్స్ తొలిసారిగా 51 ,031 తాకింది. ఇక నిఫ్టీ 15,004 టచ్ చేసింది. ఆర్బీఐ రివ్యూ పాలసీ ప్రకటించనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు ర్యాలీ అయ్యాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ సైతం 36 వేల మార్కును అధిగమించింది. బడ్జెట్ 2021 తర్వాత దలాల్ స్ట్రీట్ సరికొత్త రికార్డులకు నెలవుగా మారింది. రెండు వందల కోట్లు దాటిన మదుపర్ల సంపదతో దేశీయ మార్కెట్ లు కళకళలాడుతున్నాయి. అయితే ఈ దూకుడు కొనసాగుతుందా లేదా అన్నది మాత్రం ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం. అయినప్పటికీ ఇన్వెస్టర్ లలో ఆశావహ దృక్పధం కనిపిస్తుంది.

ప్రభుత్వ హామీలు , అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు కారణంగా జైత్రయాత్ర
ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, దీర్ఘకాలిక ప్రణాళికతో కూడిన బడ్జెట్ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించింది. 2021 22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ హామీలతో జోరందుకున్న మార్కెట్లు లాభాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలకు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్లుగా ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ ల జైత్రయాత్ర కొనసాగుతోంది. అందుకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు కూడా ఊతం ఇస్తోంది.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications