విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. దేశీయ విమానాల ప్రయాణాలపై ఛార్జీలను పెంచుతూ కేంద్ర పౌరవిమానాయానశాఖ నిర్ణయించింది. దేశీయ విమాన చార్జీలను 5శాతం మేరా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కరోనాతో దెబ్బతిన్న ఏవియేషన్ రంగం తిరిగి కోలుకునేందుకే ఈ చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సమర్థించుకుంది. కాగా ఒకే నెలలో రెండు సార్లు ఛార్జీలు పెంచడం చర్చనీయాంశంగా మారింది.
విమాన ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో విమాన చార్జీలను కూడా పెంచాలని కేంద్రం భావించింది. అయితే ఇది కేవలం దేశీయ విమాన ప్రయాణాలకు మాత్రమే పరిమితం చేసింది. విమాన ఛార్జీల్లోని లోవర్ ఫెయిర్ బ్యాండ్‌ను 5శాతం మేర పెంచుతూనే అప్పర్ ఫెయిర్ బ్యాండ్‌ను మాత్రం స్థిరంగానే ఉంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఒక నెలలో మూడు సందర్భాల్లో ప్రయాణికుల రద్దీ రోజువారీగా 3.5 లక్షల మంది ఉంటే విమాన సర్వీసులను 100శాతం పునరుద్ధరిస్తామని కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఏప్రిల్ నెల వరకు 80శాతం సామర్థ్యంతో మాత్రమే విమానాలు నడపాలని కేంద్రం పేర్కొంది. ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో కేంద్రం ప్రయాణికుల పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ కారణంగా కొన్ని ఆంక్షలు అమలు కావడంతో గత కొద్ది రోజులుగా ప్రయాణికుల సంఖ్య తగ్గిందని కేంద్రం వెల్లడించింది.

కరోనావైరస్ కేసులు పెరుగుతుండటం, ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేయడం, పలు ఆంక్షలు విధించడంతో విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కొద్దిరోజులుగా గణనీయంగా పడిపోయింది. ఇది అన్ని రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపించిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే పరిమితి సంఖ్యను 80శాతంకు పెంచినట్లు ట్వీట్ చేశారు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ. ప్రస్తుతం కరోనా కంటే ముందు ఎలాగైతే విమానాలు పూర్తి సామర్థ్యంతో నడిచేవో అలానే ఇప్పుడు కూడా దాదాపుగా పూర్తి సామర్థ్యంతో నడిచేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది.


Click it and Unblock the Notifications