షేర్ల తనఖాతో రుణం తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి..

డబ్బుల అవసరం ఎప్పుడైనా రావచ్చు. పండగలు లేదా పిల్లల విద్యాభ్యాసం లేదా పెళ్లిళ్లకు ఆస్పత్రి ఖర్చులకు డబ్బు అవసరం ఏర్పడవచ్చు. ఇలాంటి సందర్భంలో చాలా మంది తమకు తెలిసిన వారి దగ్గరి నుంచి అప్పు తీసుకుంటారు. లేదా తమ బ్యాంకు డిపాజిట్లు ఏమైనా ఉంటే వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా కొంత మంది బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణం తీసుకుంటారు. మరికొంత మంది బంగారం తనఖాతో రుణం పొందుతారు. అయితే వీటికన్నా కొంత మంది మాత్రం తమ వద్ద ఉన్న షేర్లను తనఖా పెట్టి రుణాన్ని పొందుతారు. కంపెనీల ప్రమోటర్లు ఇలా షేర్లను తనఖా పెట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. చిన్న ఇన్వెస్టర్లు కూడా తమ ఖాతాలో ఉన్న షేర్లను తనఖా పెట్టడం ద్వారా తమకు అవసరమైన మేరకు సొమ్మును పొందడానికి అవకాశం ఉంటుంది.

50 శాతం వరకు...

50 శాతం వరకు...

* బ్యాంకుల వద్ద షేర్లను తనఖా పెట్టి డబ్బు తీసుకోవాలనుకునే ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిందేమిటంటే ఆ షేర్ల విలువలో 50 శాతం వరకు రుణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. షేర్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటే మీరు పొందే సొమ్ములోనూ హెచ్చుతగ్గులు ఉంటాయన్న విషయాన్నీ గమనించాలి.

* 21 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు వయసున్న ఇన్వెస్టర్లు షేర్ల తనఖాతో రుణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.

మార్జిన్ మనీ

మార్జిన్ మనీ

* షేర్ల విలువ పెరిగినపుడు వాటి వల్ల ఉండే రిస్క్ గురించి బ్యాంకులు పెద్దగా పట్టించుకోవు. కానీ ధర తగ్గినప్పుడు మాత్రం బ్యాంకులు వెంటనే అప్రమత్తం అవుతాయి. ఇలాంటి సమయంలో రుణం తీసుకున్న వాళ్ళు లోన్ టు వేల్యూ రేషియో ను కలిగి ఉండటానికి గాను అందనంగా మార్జిన్ మనీ సమకూర్చాల్సి ఉంటుంది.

* రుణ వాయిదాలను చెల్లించడంలో జాప్యం చేస్తే కొన్ని బ్యాంకులు నెలకు 2 శాతం లేదా వార్షికంగా 24 శాతం జరిమానాను వసూలు చేస్తాయి.

* ఓవర్డ్రాఫ్ట్ సదుపాయంగా బ్యాంకులు షేర్లపై రుణాన్ని అందిస్తాయి.

* పెద్ద కంపెనీల షేర్లు లేదు. షేర్ల ధరల్లో భారీ హెచ్చు తగ్గులు లేని సమయంలో బ్యాంకుల నుంచి తగిన స్థాయిలో రుణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ షేర్ల లో ఎక్కువ ఒడిదొడుకులు ఉంటాయి. కాబట్టి వీటిని తనఖా పెట్టడం వల్ల తక్కువ మొత్తం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.

వడ్డీ రేట్లు - చార్జీలు

వడ్డీ రేట్లు - చార్జీలు

* షేర్ల తనఖాతో బ్యాంకులు ఇచ్చే రుణంపై ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా వడ్డీ రేట్లను, ప్రాసెసింగ్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే రుణం తీసుకోవాలా వద్ద అన్న దాని గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు.. యాక్సిస్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు 10.5 శాతం నుంచి 12.75 శాతం వరకు ఉంది. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు 0.15 శాతంగా ఉంది. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వడ్డీ రేటు 9.75-12.4 శాతం ఉండగా ప్రాసెసింగ్ చార్జీలు 0.75 శాతం వరకు ఉన్నాయి. వీటిలో మార్పులు కూడా జరగవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+