Gold: ప్రపంచంలో అత్యధిక బంగారం కలిగిన దేశం మనదే.. మన వద్ద ఎంత పసిడి ఉందంటే..!

ఫారిన్ దేశాలతో పోలిస్తే భారతీయులు ఎక్కువగా బంగారం ఆభరణాలు ధరిస్తారు. ఇది ఒక సంప్రదాయంగా వస్తుంది. రాజుల కాలంలో కూడా టన్నుల బంగారాన్ని మెయింటెన్ చేశారు. రాజులు, రాణులు బారీగా బంగారం ధరించే వారు. ఆ తర్వాత కాలంలో ఇది కొనసాగింది. సాధారణ ప్రజలు కూడా పసిడి ధరిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయాల్లో భారతీయులు భారీగా పుత్తడిని కొనుగోలు చేస్తారు. అంతే కాకుండా పలు పండుగల సందర్భంగా కూడా పసిడి కొనుగోలు భారీగా నే ఉంటుంది. దాదాపు చాలా వరకు శుభకార్యాలకు ముందు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అందుకే ఇతర దేశాల కంటే భారతీయులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారని ఒక అభిప్రాయం ఉంది.

భారతీయులు బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం మంచి విషయమేనని నిపుణులు చెబుతున్నారు. మన పూర్వీకులు ముందు చూపుతోనే పసిడి కొనుగోలును ఒక సంప్రదాయంగా కొనిసాగించారని అభిప్రాయపడ్డారు. అయితే భారతీయుల వద్ద ఎంత బంగారం ఉందనే సందేహాలు ఇప్పుడు వస్తున్నాయి. భారతీయుల ఇళ్లలో దాదాపు 25 వేల టన్నుల పసిడి ఉన్నట్లు ఒక అంచనా ఉంది. అయితే దీనికి కచ్చితమైన ప్రామాణికం లేదు. భారతీయుల వద్ద ఉన్న పసిడి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న బంగారం కంటే చాలా ఎక్కువ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం ఉంది.

Gold Price Today

భారతీయులు బంగారం కలిగి ఉండడం మంచి విషయమని నిపుణులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో పసిడి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ప్రపంచంలోని దేశాలలో కంటే భారతీయుల వద్దే ఎక్కువ బంగారం ఉందని ఒక అంచనా.. అయితే సెంట్రల్ బ్యాంకుల పరంగా చూస్తే అమెరికా వద్ద అత్యధికంగా పసిడి ఉంది. అమెరికా వద్ద 8133.46 టన్ను బంగారం ఉండగా.. ఇటలీ వద్ద 2451.84 టన్నుల పుత్తడి ఉంది. చైనా 2346 టన్నుల బంగారంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. రష్యా 2282.98 టన్నులతో నాలుగో స్థానంలో ఉండగా..1039.94 టన్నులతో స్విట్జర్లాండ్ ఐదో స్థానంలో నిలిచింది. భారత్ ఆరో స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో జపాన్, పోలండ్, టర్కీ, ఉజ్బెకిస్థాన్ ఉన్నాయి.

కాగా ఈ మధ్య కాలంలో చైనా సెంట్రల్ బ్యాంకు భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది. సెంట్రల్ బ్యాంకుల పరంగా చూస్తే అమెరికా వద్ద అత్యధిక బంగారం ఉండా.. ప్రజల వద్ద అత్యధిక బంగార ఉన్న దేశంగా భారత్ నిలిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారతీయుల వద్ద ఉన్న బంగారం 25 వేల టన్నులు అమెరికా, ఇటలీ, చైనా, రష్యా సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం కంటే ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా మన పూర్వీకులు బంగారం కొనుగోలు చేయడాన్ని సంప్రదాయంగా కొనసాగించడం మంచి విషయంగా చెబుతున్నారు. కాగా భారతీయుల వద్ద ఉన్న బంగారానికి సంబంధించి కచ్చితమైన లెక్కలు లేపు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+