PAN-Aadhaar Link: ఆధార్‍తో పాన్ లింక్ చేయకుంటే ఏమవుతుందో తెలుసా..!
ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయలేదా. .అయితే మీ పాన్ కార్డు పనిచేయదు. ఆదాయపు పన్ను శాఖ జూన్ 30 వరకు రూ.1000 జరిమానాతో ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేసుకోవాడనికి అవకాసం కల్పించింది. అయితే ఇప్పటి వరకు కూడా కొందరు పాన్ కార్డు ఆధార్ తో లింక్ చేయలేదు. దీంతో వారి పాన్ కార్డులు పనిచేయవని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. మీరు ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేయకుంటే.. బ్యాంకులో రూ.50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేయలేరు. అదే సమయంలో రూ.50 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేయలేరు.
పాన్ కార్డు ఆధార్ తో లింక్ చేయకుంటే క్రెడిట్, డెబిట్ దరఖాస్తు చేసుకోలేరు. బ్యాంకు ఖాతా ప్రారంభించలేరు. డీమ్యాట్ ఖాతా కూడా ఓపెన్ చేయలేరు. రూ.50 వేల కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టలేరు. రూ.50 వేల కంటే ఎక్కువ ప్రీమియం ఉన్న బీమా పాలసీలను చెల్లించలేరు. అంతే కాదు కొత్త మోటారు వాహనాలను కొనుగోలు చేస్తే అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పాన్ పని చేయకుంటే రూ.1,00,000 కు మించిన సెక్యూరిటీల కొనుగోలు కానీ విక్రయం చేయలేరు. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆస్తులు కొనుగోలు చేయలేరు. ఇవే కాకుండా ఆర్థిక లావాదేవీల్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావొచ్చు. ఇప్పటికీ ఆధార్ తో పాన్ లింక్ చేయని వారు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు.
కానీ.. అందుకు 30 రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు పాన్ కార్డు పని చేయదు. మీరు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపలేరు. ఇప్పుడు కూడా మీరు ఆధార్ తో పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చని సీబీడీటీ తెలిపింది. కానీ మీ పాన్ కార్డు నెల రోజుల పాటు పని చేయదు. ఉదహరణకు మీరు జులై 9న రూ.1000 చెల్లించి ఆధార్ పాన్ లింక్ చేస్తే.. మీ పాన్ ఆగస్ట్ 8 నుంచి పని చేస్తుంది.


Click it and Unblock the Notifications