మీరు డీమ్యాట్ ఖాతా తీసుకున్నారా? దీని అవసరం లేమిటో తెలుసా ? డీమ్యాట్ ఖాతాలను ఎలా ఉపయోగించుకోవాలి, వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా ? ఒకవేళ మీకు ఇప్పటిదాకా తెలియకుంటే ఈ స్టోరీ ద్వారా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీకు నచ్చినా లేదా మీ స్నేహితుల అవసరానికి తగిన డీమ్యాట్ అకౌంట్ ను మీరే సూచించవచ్చు. అయితే ఆ ఖాతాల వివరాలు తెలుసుకుందామా...

డీమ్యాట్ నేపథ్యం
డీమ్యాట్ అదే డీమాటేరియలైజ్డ్ ఖాతా ద్వారా కంపెనీలకు సంబందించిన షేర్లను డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. షేర్లను కొనుగోలుచేయడానికే కాకుండా వాటిని భద్రంగా దాచుకోవడానికి ఈ ఖాతాను ఉపయోగిస్తారన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది మీ బ్యాంకు ఖాతా లాంటిదే. ఈ ఖాతాలో షేర్లతో పాటు బాండ్లు, ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీలను కలిగి ఉండవచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేసినప్పుడు అవి మీ డీమ్యాట్ ఖాతాలో క్రెడిట్ అవుతాయి. మీరు ఒకవేళ వాటిని విక్రయిస్తే అవి మీ ఖాతా నుంచి డెబిట్ అవుతాయి. ఇంతకు ముందు షేర్లకు సంబందించి పత్రాలు ఉండేవి. ఇప్పుడు వాటిని ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవచ్చు. వీటిని ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. అవసరమైతే కొనుగోలు చేయవచ్చు.

ఎన్ని రకాలున్నాయంటే...
ఇన్వెస్టర్లందరూ ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్కరి అవసరాలు, ఆలోచనలు ఒక్కోవిధంగా ఉంటాయి. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొనే మూడు రకాల డీమ్యాట్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చారు. అవి..

రెగ్యులర్ డీమ్యాట్ ఖాతా
దేశంలోని పౌరులు, దేశంలో నివసిస్తున్నవారు ఈ రకం డీమ్యాట్ ఖాతాను వినియోగిస్తారు. ఎన్ఎస్డీఎల్, సిడీఎస్ఎల్ వంటి డిపాజిటరీలు ఇంటెర్మ్డైటరీస్ లేదా డిపాజిటరీ పార్టిసిపంట్స్ లేదా స్టాక్ బ్రోకర్ల ద్వారా దీన్ని పొందవచ్చు. ఈ ఖాతా ద్వారా చాలా సులభంగా ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. షేర్లను బదిలీ కూడా చేయవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లు ఉంటాయి కాబట్టి అవి పాడు కాకుండా దొంగతనానికి గురికాకుండా ఉంటాయి.

రీపాట్రియేబుల్ డీమ్యాట్ ఖాతా
ఈ ఖాతా ప్రవాస భారతీయులకు (ఎన్ ఆర్ ఐ) ఉపయోగ పడుతుంది. దీని ద్వారా వీరు భారత షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. విదేశాల్లోనూ నిధుల బదిలీకి అవకాశం ఉంటుంది. ఈ ఖాతా కావాలనుకునే వారికి ఎన్ఆర్ఈ బ్యాంక్ ఖాతా ఉండాలి. ఎన్ ఆర్ ఐ లు ఈ ఖాతాను తెరవాలంటే ఫారిన్ ఎక్స్చేంజి మేనేజ్మెంట్ చట్ట (ఫెమా ) నిభందనలు, భారత రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది.

నాన్- రీపాట్రియేబుల్ డీమ్యాట్ ఖాతా
ఇది కూడా ఎన్ ఆర్ ఐ ల కోసమే. ఇందులో విదేశాల్లో నిధుల బదిలీ చేయరాదు. ఈ ఖాతా కోసం ఎన్ ఆర్ ఓ బ్యాంక్ ఖాతా అవసరం ఉంటుంది. ఈ ఖాతా కోసం నిర్దేశిత నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications