ఇటీవలి సంవత్సరాలలో భారతీయ స్టాక్ మార్కెట్ డెలివరీ చేసిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో డిక్సన్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్ షేర్లు ఒకటి. ఈ స్టాక్ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా ట్రస్టీ, పీజీఐఎం ఇండియా ట్రస్టీ మొదలైన వివిధ మ్యూచువల్ ఫండ్లు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాయి. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా(LIC) కూడా డిక్సన్ టెక్నాలజీస్ లో పెట్టుబడి పెట్టింది.
నోయిడా ఆధారిత ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ గత ఒక సంవత్సరంలో తన వాటాదారులకు దాదాపు 150 శాతం రాబడిని అందించింది. అయితే గత ఐదేళ్లలో డిక్సన్ షేరు ధర 1300 శాతానికి పైగా పెరిగింది. దలాల్ స్ట్రీట్‌లో భారీ అమ్మకాలు ఒత్తడి ఉన్నప్పటికీ డిక్సన్ టెక్నాలజీస్ షేర్ ధర గత ఒక నెలలో 10 శాతం పెరిగింది. అయితే గత ఆరు నెలల్లో, ఈ టెక్ స్టాక్ 40 శాతం పెరిగింది. డిక్సన్ షేర్ ధర NSEలో దాదాపు రూ.6,460 నుంచి రూ.6,952 వరకు పెరిగింది.

దాని వాటాదారులకు 5 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. అయితే, గత ఏడాది కాలంలో భారతీయ స్టాక్ మార్కెట్‌లోని మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సమయంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కో షేరు స్థాయికి దాదాపు రూ.2,868 నుంచి రూ.6,952కి పెరిగింది. ఈ సమయంలో దాదాపు 150 శాతం పెరిగింది. ఐదేళ్లలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపుగా ఒక్కో షేరుకు రూ.494 నుంచి రూ.6,952 వరకు పెరిగింది.
ఒక ఇన్వెస్టర్ ఒక నెల క్రితం డిక్సన్ టెక్నాలజీస్ (ఇండియా) షేర్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే దాని విలువ ఇప్పుడు రూ.1.10 లక్షలకు చేరి ఉండేది. అలాగే ఆరు నెలల క్రితం డిక్సన్ టెక్నాలజీస్ షేర్లలో ఒక పెట్టుబడిదారు రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే దాని విలువ ఇప్పుడు రూ. 1.40 లక్షలకు చేరి ఉండేది. అయితే ఒక ఇన్వెస్టర్ ఒక సంవత్సరం క్రితం డిక్సన్ టెక్నాలజీస్ స్టాక్‌లలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ రూ.2.50 లక్షలుగా మారేది.
డిక్సన్ టెక్నాలజీస్ షేర్‌హోల్డింగ్ విధానం ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ 1,04,04,213 డిక్సన్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్ షేర్లను లేదా కంపెనీలో 17.39 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ యాజమాన్యంలోని ఈ 17.39 శాతం వాటాలలో, హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ 2.66 శాతం, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ స్కీమ్ 2.08 శాతం కలిగి ఉండగా, ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో నిప్పాన్ లైఫ్ ఇండియా ట్రస్టీ 2.83 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అలాగే ఎల్ఐసీ 16,93,495 డిక్సన్ టెక్నాలజీస్ షేర్లను కలిగి ఉంది.
Note: ఇది కేవలం నిపుణుల విశ్లేషణ మాత్రమే. దీనికి గుడ్ రిటర్న్స్ తెలుగుకు సంబంధం లేదు.


Click it and Unblock the Notifications