భారతదేశంలో మధ్య తరగతి వర్గం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందంటూ బ్లండ్ వర్డ్స్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు శ్యామ్ అచ్యుతన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఇప్పుడు మధ్య తరగతి వర్గం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎటు కాని వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ధనవంతులూ పేదల మధ్య కాకుండా, దోపిడి దొంగలు- సంపద కూడగట్టుకునేవారి మధ్యే అసలు తేడా కనిపిస్తోందని తెలిపారు.
సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం.. లింక్డిన్‌లో ఆయన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో మధ్య తరగతి అంటే శ్రమించి సంపాదించే కుటుంబాలు, బైక్ నించి కార్, సంవత్సరానికి ఒకసారి విహారయాత్రలు, సొంత ఇంటిని కొనాలనే కలలు.. ఇవే మధ్యతరగతి జీవులకు సాధారణ కోరికలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని ఆయన అంటున్నారు. "ఇప్పటి మధ్య తరగతి కుటుంబాలు ఓ ప్రమాదకరమైన దారిలో నడుస్తున్నాయి. సంపన్నులు కావడం లేదా ఆర్థికంగా కుదేలవడం.. ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు.

ఇమీఐలతో నిండిన ఐఫోన్లు, మితిమీరిన అప్పులతో ఈ తరం ధనవంతుల్లా కనిపించాలనే తాపత్రయంలో వారంతా ఇంకా అప్పుల్లోకి కూరుకుపోతున్నారని శ్యామ్ అచ్యుతన్ గారు తెలిపారు. ఉదాహరణగా ఆయన ఒక రూ. 40 వేల జీతాన్ని తీసుకుని చూపించారు. అందులో రూ. 20,000 అద్దెకు, రూ. 10,000 లోన్లకు, రూ. 5,000 వీకెండ్ ఖర్చులకు పోతున్నాయి. పెట్టుబడుల కోసం చివరకు రూ. 1,000 కూడా మిగలదు. "ఇది లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామనే భ్రమలో వారు చేసుకుంటున్న ఆర్థిక ఆత్మహత్యేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్టేటస్ కోసం భవిష్యత్తును పణంగా పెట్టి ఋణంగా తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
అయితే కొందరు తెలివైనవాళ్లు మాత్రం తక్కువ ఖర్చుతో జీవిస్తూ, చిత్తశుద్ధిగా పెట్టుబడులు పెడుతూ, భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు వారు ఇప్పుడు ధనవంతుల్లా కనిపించకపోవచ్చు. కానీ 10 ఏళ్లలో వారు ఇంటి యజమానులు అవుతారు. మిగతావాళ్లు అప్పుడూ అద్దెకు ఉంటారని బ్లండ్ వర్డ్స్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు అన్నారు. నీదగ్గర లేని సంపదను ఎప్పుడూ బడా కోసం నకిలీగా ఇతరులకు చూపకూడదన్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అస్థిరమైన ఉద్యోగ భద్రత, AI వల్ల మారుతున్న ఉద్యోగ పరిసరాల మధ్య, మధ్య తరగతి ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన దశలో ఉందని చెప్పుకొచ్చారు "ధనవంతుల్లా నటించండి - పేదవారైపోతారు. పేదలులాగా బతకండి - ధనవంతులవుతారని కొటేషన్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన..చివరగా ఆయన ఏం చెబుతున్నారంటే.. ప్రతి రూపాయిని గణించండి, ఆదాయంలో 20-30% పెట్టుబడులలో పెట్టండి, ఆస్తులు కూడబెట్టండి. డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. ఈ రోజు తీసుకునే నిర్ణయాలే మీ రేపటి స్థితిని నిర్ణయిస్తాయని చెబుతున్నారు.
More From GoodReturns

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

LPG: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications