మన దేశంలో రానున్న అయిదేళ్లలో డిజిటల్ పేమెంట్స్ మూడింతలు కానుందని రెడ్‌సీర్ కన్సల్టింగ్ నివేదిక అంచనా వేసింది. గత ఏడాది రూ.2,162 లక్షల కోట్లుగా ఉంది. 2025 నాటికి ఇది రూ.7,092 లక్షల కోట్లకు చేరుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. అందరికీ ఆర్థిక సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వేగంగా పెరుగుతున్న డిజిటలీకరణ ఇందుకు తోడ్పడుతుందని తెలిపింది. ఇప్పటికే కరోనా లాక్ డౌన్ కారణంగా వ్యాలెట్, మొబైల్ చెల్లింపులు పెరిగాయి. ఇవి రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి.

2025 నాటికి ఇలా..
2019-20లో భారత్ డిజిటల్ చెల్లింపుల మార్కెట్ వ్యాల్యూ రూ.2,162 లక్షల కోట్లుగా నమోదయింది. ప్రస్తుతం ఉన్న 16.2 కోట్ల మంది మొబైల్ చెల్లింపుల కస్టమర్లు 2025 నాటికి 5 రెట్లు పెరిగి దాదాపు 80 కోట్లకు చేరుతారని అంచనా. ఈ నేపథ్యంలో చెల్లింపుల్లో మొబైల్ చెల్లింపుల శాతం దాదాపు 3.5 శాతం మేర ఉండనుంది. ప్రస్తుతం ఇది 1 శాతంగా ఉంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వృద్ధిలో వ్యాలెట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. వృద్ధి అనేక డిమాండ్, సరఫరా అంశాలతో ముడివడి ఉన్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం వల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగినట్లు తెలిపింది.

వ్యాలెట్స్ ద్వారా అధికం..
డిజిటల్ పేమెంట్స్‌లో కీలకపాత్ర పోషిస్తున్న వ్యాలెట్ ఆధారిత పేమెంట్స్ ఫ్రీక్వెన్సీ, యూజర్ బేస్ రెండింట్లో దినదినాభివృద్ధి చెందుతూ రానున్న డిజిటల్ మార్కెట్ పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తుందని ఈ నివేదిక తెలిపింది. 2025 నాటికి, వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు అధికంగా ఉండొచ్చునని, చివరికి తక్కువ ఆదాయ చెల్లింపుగా భావించే మల్టీపుల్ స్మాల్ టికెట్ ట్రాన్సాక్షన్స్ కూడా వ్యాలెట్స్ ద్వారా జరగవచ్చని తెలిపింది.

గ్రోసరీస్‌లో 75 శాతం పెరుగుదల
కరోనా వైరస్ నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలతో ప్రజలు సాధ్యమైనంత మేర కరెన్సీ ఉపయోగాన్ని పక్కన పెట్టారని, మొబైల్ ఫోన్స్ చెల్లింపులకు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ముఖ్యంగా గ్రాసరీ స్టోర్స్‌లో డిజిటల్ పేమేంట్స్ 75 శాతం పెరిగినట్లు తెలిపింది. స్మాల్ రిటైలర్స్‌లో ఇది పెరిగినట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications