ముంబై: భారత క్రికెట్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వేల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. 2021లో మోస్ట్ వాల్యుబుల్ సెలెబ్రిటీగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అత్యంత విలువైన ఆటగాడిగా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాదిలో కింగ్ కోహ్లీ బ్రాండ్ విలువ 185.7 మిలియన్ డాలర్లు. 2020తో పోల్చుకుంటే అతని బ్రాండ్ విలువ కాస్త తగ్గినప్పటికీ.. అతని ఛరిష్మాకు ఏమాత్రం లోటు లేదు. టాప్ మోస్ట్ సెలెబ్రిటీగా అగ్రస్థానంలో నిలిచాడు విరాట్.
డఫ్ అండ్ ఫెల్ప్స్ వెల్లడించిన టాప్ 10 మోస్ట్ వాల్యుబుల్ సెలెబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడీ డాషింగ్ క్రికెటర్. రెండో స్థానంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నిలిచాడు. అతని బ్రాండ్ వాల్యూ 158.3 మిలియన్ డాలర్లు. 139.6 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో అక్షయ్ కుమార్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆలియాభట్ బ్రాండ్ విలువ 68.1 మిలియన్ డాలర్లు. బాలీవుడ్ హీరోయిన్లల్లో టాప్ 10లో చోటు దక్కించకున్న యంగెస్ట్ సెలెబ్రిటీ ఆమె మాత్రమే. ఈ లిస్ట్‌లో ఆలియా భట్‌ది నాలుగో ప్లేస్. టీమిండియా మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బ్రాండ్ విలువ 61.2 మిలియన్ డాలర్లు.

అలాంటి విరాట్ కోహ్లీ- ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాడు. అదే డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ. కెనడియన్ బిలియనీర్ ప్రేమ్ వత్సకు చెందిన ఫైర్‌ఫాక్స్ గ్రూప్‌కు చెందిన బీమా కంపెనీ ఇది. ఇందులో విరాట్ కోహ్లీ స్టేక్స్ కొనుగోలు చేశాడు. ఇప్పుడీ కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతోంది. త్వరలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయనుంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 500 మిలియన్ డాలర్లను సమీకరించుకోవాలనేది కంపెనీ లక్ష్యం.
ప్రస్తుతం డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాల్యుయేషన్ 4.5 నుంచి 5 బిలియన్ డాలర్ల వరకు ఉంటోంది. డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవస్థాపకుడు కమలేష్ గోయెల్, విరాట్ కోహ్లీకి పెద్ద ఎత్తున వాటాలు ఉన్నాయి. 2017లో ఏర్పాటైన ఈ కంపెనీకి విరాట్ కోహ్లీ- బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. మోర్గాన్ స్టాన్లీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్.. ఈ డిజిట్ ఇన్సూరెన్స్ ఐపీఓను పర్యవేక్షించనున్నాయి. సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్‌కు అందజేయాల్సిన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను తయారు చేసే పనిలో ఉందీ కంపెనీ యాజమాన్యం.
సెప్టెంబర్‌లో ఈ ప్రాస్పెక్టస్‌ను సెబికి సమర్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలను డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ తోసిపుచ్చింది. అవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలేనని వ్యాఖ్యానించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కూడా దీనిపై స్పందించలేదు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications