బంగారం కొనడం అంటే మనలో చాలా మందికి ఆనందం. కానీ, ఒక చిన్న పొరపాటు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ తలుపు తట్టేలా చేస్తుందని ఊహించారా? బెంగళూరులో జరిగిన ఒక నిజమైన కేస్ ఈ విషయాన్ని బలంగా గుర్తు చేసింది అదే బిల్ దాచకపోవడం.
2019లో బెంగళూరులో ఒక వ్యక్తి ఇంటి పై ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ తనిఖీ చేసింది. ఆ తనిఖీలో అధికారులు సుమారు రూ. 1.65 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు కనుగొన్నారు. ఆ వ్యక్తి చెప్పాడు "ఇవి నా భార్యవే, మేము ఇవన్నీ క్రెడిట్ కార్డ్ లేదా ఆన్‌లైన్ ద్వారా కొన్నాం" అని. కానీ ఆయన చూపించిన బిల్లులు, సీజ్ చేసిన ఆభరణాలతో సరిపోలేదు. అంటే బరువు, డిజైన్ లేదా విలువలో తేడా ఉంది. అందుకే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఇవి 'వివరణ లేని ఆస్తులు' (Unexplained Investments) అని పేర్కొన్నారు. దాంతో ఆ ఆభరణాల మొత్తం విలువను ఆయన ఆదాయంలో జోడించి పన్ను విధించారు. అంటే బిల్లులు సరిగా లేకపోతే లేదా సాక్ష్యాలు సరిపోకపోతే, అది పెద్ద పన్ను సమస్యగా మారుతుంది.

ఆ వ్యక్తి ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు. వెంటనే ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ (అపీల్స్) దగ్గర అప్పీల్ చేసాడు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ, ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మాత్రం ఆ తీర్పుతో సంతృప్తి చెందలేదు. కేసును మరోసారి ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పెలేట్ ట్రిబ్యునల్ (ITAT) వద్దకి తీసుకెళ్లింది. అక్కడ మాత్రం ఆ వ్యక్తి కి మళ్లీ విజయం లభించింది. ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది "ఆభరణాలు ఇప్పటికే ఆయన భార్య యొక్క ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లో పేర్కొనబడ్డాయి. ఒకే ఆస్తిని రెండుసార్లు పన్ను విధించడం చట్ట విరుద్ధం."దాంతో ఆ వ్యక్తి కు ఊరట లభించింది.
ఇందులో మనకు నేర్చుకోవాల్సినది ఏమిటి?
ఈ కేస్ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతోంది. క్రెడిట్ కార్డ్ లేదా ఆన్‌లైన్ ద్వారా కొన్నామని చెప్పడం మాత్రమే సరిపోదు. మీరు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన బిల్లులు, చెల్లింపు రశీదులు, బ్యాంక్ స్టేట్మెంట్‌లు అన్నీ సురక్షితంగా ఉంచుకోవాలి. ఎందుకంటే, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు బిల్లులు లేకపోతే లేదా సాక్ష్యాలు సరిగా లేకపోతే, ఆ వస్తువులను "వివరణ లేని ఆస్తులు"గా పరిగణించవచ్చు. అప్పుడు మీరు నిజంగానే చెల్లించినా కూడా, పన్ను సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
నిపుణుల సలహా ఏమంటుంది?
చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ సురానా ఏం చెబుతున్నారంటే ఎవరికైనా బంగారం, వజ్రాలు, ఆర్ట్ వర్క్ లేదా లగ్జరీ వస్తువులు కొంటే, వాటి బిల్లులు తప్పనిసరిగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇవే ట్యాక్స్ విచారణ సమయంలో మీకు రక్షణగా ఉంటాయి. అలాగే, కుటుంబ సభ్యుల ఆస్తులు లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తుల వివరాలు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లో స్పష్టంగా చూపించడం చాలా ముఖ్యం.
ఈ బెంగళూరు కేస్ మనందరికీ ఒక గోల్డెన్ రూల్ నేర్పుతోంది. డిజిటల్ పేమెంట్ చేసినా, బిల్ తప్పక దాచుకోవాలి. బిల్ లేకుంటే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు అది "సందేహాస్పద ఆస్తి"గా చూడవచ్చు. కానీ బిల్ ఉంటే, మీరు పూర్తిగా సురక్షితంగా ఉంటారు. కాబట్టి, ఇక మీదట బంగారం కొన్నప్పుడు గుర్తుంచుకోండి గోల్డ్ కొంటే బిల్ కూడా గోల్డ్ లాంటిదే.
More From GoodReturns

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications