ధనతెరాస్-దీపావళి పర్వదినం సమయంలో చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే పసిడిని కొనుగోలు చేయాలని చూసేవారు కేవలం హాల్‌మార్క్ ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర వినియోగ వ్యవహారాల విభాగం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
BIS రిజిస్టర్డ్ జ్యువెల్లర్స్ వద్ద మాత్రమే హాల్ మార్క్ పసిడి, వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలని పేర్కొంది. ఏదైనా సందర్భంలో నేరుగా చూసినప్పుడు హాల్‌మార్క్ సరిగ్గా కనిపించకుంటే సంబంధిత జ్యువెల్లరీ దుకాణదారుడిని మాగ్నిఫైయింగ్ గ్లాస్ కోసం కోరాలని పేర్కొంది. ఈ ఏడాది జూన్ 23వ తేదీ నుండి హాల్‌మార్క్ బంగారు ఆభరణాలు మాత్రమే విక్రయించాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో హాల్‌మార్క్ ఉన్న 14, 18, 22 క్యారెట్ల బంగారం మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు అమల్లోకి తెచ్చింది. ఈ జిల్లాల్లో మాత్రమే హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి.

అలాగే, కొనుగోలుదారులు తమ బంగారం కొనుగోళ్లపై బిల్లు ఇవ్వాలని వ్యాపారులను కోరాలని కేంద్రం తెలిపింది. BIS మార్క్ కింద క్యారెట్ ప్యూరిటీ, గోల్డ్ ఫిట్‌నెస్, ఆరు నెంబర్స్ అల్ఫాన్యూమరిక్ HUID కోడ్ ఉండాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications