కరోనా కారణంగా గత కొద్ది నెలలుగా వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి. ప్రజారవాణాకు భయపడుతున్న వారు తమ కుటుంబాల కోసం కార్లు కొనుగోలు చేస్తున్నారు. కొత్త కార్ల విక్రయాలు కూడా పెరిగినప్పటికీ, ప్రధానంగా సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు పెరిగాయి. కొత్త కారు కొనుగోలు చేసే స్తోమత లేనివారు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సొంత వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. సెప్టెంబర్ క్వార్టర్‌లో మన దేశంలో వాహనాల సేల్స్ పెరిగాయి.

సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు పెరిగాయి!
సెకండ్ హ్యాండ్ కార్లు రూ.50వేల నుండి లభిస్తున్నాయి. దీంతో కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు వీటికి డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతుండటం గమనార్హం. గతంలో రూ.50వేలు పలికిన కారు, ఇప్పుడు రూ.లక్ష వరకు పలుకుతోందట. కరోనా కారణంగా దగ్గరి ప్రయాణానికి ఆటోలు, బస్సుల్లో వెళ్లేందుకు చాలామంది భయపడుతున్నారు. కొత్త కారు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఉపయోగించిన కార్ల వైపు చూస్తున్నారు. కానీ వీటి ధరలు గతంలో కంటే కాస్త పెరిగాయి.

రెండింతలు పెరిగిన సేల్స్
ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా తేడా లేదు. కాబట్టి కొనుగోలుదారులు పెట్రోల్ కార్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారట. సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు గతంలో కంటే రెండింతలు పెరిగాయ. కొన్నిచోట్ల మూడు నుండి నాలుగు రెట్లు పెరిగిందట. ఎక్కువ మంది రూ.1 లక్ష నుండి రూ.3 లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

బ్రిటన్‌లోను అదే పరిస్థితి
మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. బ్రిటన్‌లో సెప్టెంబర్ నెలలో ఉపయోగించిన కారు సేల్స్ 15 శాతం పెరిగాయని ఓ డేటా వెల్లడిస్తోంది. దీంతో కారు ధరలు పెరగడంతో పాటు వడ్డీ రేటు కూడా పెరిగిందట. ఏఏ కార్ డేటా ప్రకారం సెప్టెంబర్ నెలలో యూజ్డ్ కార్ల కోసం బ్రిటన్‌కు చెందిన 48 పట్టణాలు, నగరాల్లో భారీగా పెరిగిందట. జూన్ నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో 4 శాతం పెరిగింది. గ్లాస్‌గో వంటి పట్టణాల్లో సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఏకంగా 32 శాతానికి పైగా వెతుకుతున్నారట.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications