కరోనా టైంలో సీనియర్ ఉద్యోగులకే డిమాండ్, భారీ వేతనాలు
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏప్రిల్ నుండి జూలై మధ్య సీనియర్ లీడర్‌షిప్ హైరింగ్స్ పెరిగాయని టాలెంట్ కామర్స్ ప్లాట్‌ఫామ్ సిక్కీ సర్వే వెల్లడించింది. ఈ వైరస్ కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. సీనియర్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని కొన్ని సర్వేలు తెలిపాయి. అయితే అందుకు భిన్నంగా గత మూడు నెలలుగా పలు కంపెనీలు సీనియర్ లెవల్ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచారని ఈ సర్వే తెలిపింది.

సీనియర్లకు ప్రాధాన్యత
72 శాతం కంపెనీలు 8 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల అనుభవం కలిగిన ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 28 శాతం మంది జూనియర్ ఉద్యోగులకే సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. సిక్కీ టాలెంట్ సంస్థ ముంబై, పుణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఐటీ నిపుణులు, ప్రముఖ కంపెనీలను విశ్లేషించి ఈ సర్వేను నిర్వహించింది.

అందుకే సీనియర్ ఉద్యోగులు
ఈ సర్వేలో ఎనలిస్ట్, ఇంజనీర్, టెస్టర్, డెవలపర్ వంటి విభాగాలకు సంబంధించి నిపుణుల్ని సంప్రదించారు. కరోనా వైరస్ ప్రారంభంలో ప్రాజెక్టులు లేక కంపెనీలు సీనియర్ ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు చెల్లించలేక ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇప్పుడు కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడాని కంపెనీలు సీనియర్ ఉద్యోగులకు భారీ వేతనాలు ఇస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

సీనియర్లు.. జూనియర్లు
ఈ సర్వే ప్రకారం ఏప్రిల్ - జూన్ మధ్య 72 శాతం కంపెనీలు సీనియర్ ఉద్యోగులను, 28 శాతం మంది ఫ్రెషర్స్‌ను తీసుకున్నారు. కంపెనీలు 8 నుండి 15 ఏళ్ల వయస్సు అనుభవం కలిగిన వారిని 72 శాతం మందిని, 28 శాతం మందిని ఫ్రెషర్స్‌ను, ఏడేళ్ల ఎక్స్‌పీరియన్స్ వరకు కలిగిన మిడ్ లెవల్ ఉద్యోగులను తీసుకున్నారు.


Click it and Unblock the Notifications