బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ కంపెనీ భారత్ నుండి 120 కోట్ల డాలర్ల పరిహారం వసూలుకు ఎయిరిండియా కంపెనీ ఆస్తుల జఫ్తుకు కోర్టును ఆశ్రయించింది. మన కరెన్సీలో రూ.12వేల కోట్లకు పైగా. ఎయిరిండియా చట్టపరంగా భారత ప్రభుత్వానికి చెందిన ఆస్తి అని పేర్కొంది. ఈ మేరకు న్యూయార్క్ సౌత్ డిస్ట్రిక్ట్ కోర్టులో గత శుక్రవారం దావా వేసింది. చమురు అన్వేషణ రంగంలోని కెయిర్న్ కంపెనీ భారత ప్రభుత్వంతో తలెత్తిన వివాదంలో ఎయిరిండియా ఆస్తిని జప్తు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై ఎయిరిండియా స్పందించాల్సి ఉంది.

నోటీసులు అందాక..
తమకు ఎలాంటి నోటీసులు అందలేదని, నోటీసులు అందుకున్న తర్వాత ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యల నుండి రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కెయిర్న్ దావా నేపథ్యంలో ఎయిరిండియా ప్రయివేటీకరణకు భారత ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. 2006లో కెయిర్న్ నుండి వసూలు చేసిన క్యాపిటల్ గెయిన్స్‌కు సంబంధించినది ఈ కేసు.

ఇదీ కేసు
1994లో భారత్‌లో చమురు, గ్యాస్ రంగంలో కెయిర్న్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టింది. దశాబ్దకాలం తర్వాత రాజస్థాన్‌లో భారీ చమురు క్షేత్రాన్ని గుర్తించింది. 2006లో బీఎస్ఈలో తమ భారతీయ ఆస్తులను కెయిర్న్ లిస్టింగ్ చేసింది. అయిదేళ్ల తర్వాత కెయిర్న్ పైన భారత్ రెట్రోయాక్టివ్ ట్యాక్స్ చట్టాన్ని అమలు చేసింది.
రీఆర్గనైజేషన్‌కు సంబంధించి రూ.10,247 కోట్లు, దానిపై వడ్డీ, జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా కెయిర్న్ ఇండియా డివిడెండ్స్‌ను, పన్ను రిఫండ్స్‌ను జఫ్తు చేసింది. దీనిపై హేగ్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్‌లో కెయిర్న్ ఫిర్యాదు చేసింది. ఇక్కడ కెయిర్న్‌కు అనుకూంగా తీర్పు వచ్చింది. దీనిపై భారత్ న్యాయపోరాటం చేసింది.

కెయిర్న్ ఆరోపణ.. పరిహారం వసూలు యత్నం
భారత్ పాత తేదీ నుండి పన్ను వసూలు చేసినట్టు కెయిర్న్ ఆరోపించింది. ఈ ఆరోపణలతో 120 కోట్ల డాలర్ల పరిహారం రాబట్టుకునేందుకు కేసు వేసి విజయం సాధించింది. ఇప్పుడు ఆ పరిహారం రాబట్టుకునేందుకు ఎయిరిండియా ఆస్తులను జఫ్తు చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరింది. అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, కెనడా కోర్టుల్లోను పరిహారం కోసం దావాలు వేసేందుకు కెయిర్న్ ప్రయత్నిస్తోంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications