ఇంటిపైనా ఆదాయపు పన్ను చెల్లించాలా..? ITR ఫైలింగ్‌కు ముందు డీమ్డ్ రెంట్ గురించి తెలుసుకోండి..
Deemed Rent: ఆదాయపు పన్ను శాఖ పరిమితులకు అనుగుణంగా దేశ ప్రజలు ఏటా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఖాళీగా ఉన్న ఇంటి ఆస్తిపై కూడా ఆదాయపు పన్ను చెల్లించాలని మీకు తెలుసా..? IT రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతుండగా.. ఏ పరిస్థితుల్లో ఈ విధంగా ట్యాక్స్ కట్టాలో చూద్దాం..
ఎవరైనా ఓ వ్యక్తి పేరు మీద రెండు కంటే ఎక్కువ ఇళ్లు కలిగి ఉంటే అప్పుడు డీమ్డ్ రెంట్ అనే కాన్సెప్ట్ సదరు వ్యక్తికి వర్తిస్తుంది. అంటే ఆ ఇంటిని అద్దెకు ఇచ్చినా లేదా ఖాళీగా ఉన్నా దానిపై నుంచి మీకు ఆదాయం వస్తున్నట్లుగానే పరిగణించాల్సి ఉంటుందన్నమాట. అందువల్ల ఆ ఇంటి ఆస్తిపై ఆదాయపు పన్ను చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి.

ట్యాక్స్ పేయర్ కు ఉన్న మొదటి రెండు ఇళ్లు 'డీమ్డ్ టు లెట్ అవుట్ ప్రాపర్టీ'గా పరిగణించబడుతుంది. తదుపరి ఇల్లు ఖాళీగా ఉన్నప్పటికీ డీమ్డ్ రెంట్ నిబంధన ట్రిగ్గర్ అవుతుంది. 'ఇలా రెండు కంటే ఎక్కువ ఇళ్లు ఉన్న పన్ను చెల్లింపుదారులు.. ప్రతి ఇంటి నుంచి వచ్చే ఆదాయన్ని విడిగా లెక్కించి అందుకు అనుగుణంగా క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది' అని RSM ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ సురేష్ సురానా తెలిపారు.
ఇంటి స్థూల వార్షిక విలువను(GAV) ఆధారంగా చెల్లించాల్సిన ట్యాక్స్ ను లెక్కిస్తారు. అందువల్ల ఉన్న ఇళ్లలో ఏ రెండింటిని స్వీయ ఆస్తులుగా పరిగణిస్తున్నాం అనే నిర్ణయంపై పే చేయాల్సిన పన్ను ఆధారపడి ఉంటుందని గమనించాలి. ఉదాహరణకు A, B, C అనే మూడు ఇళ్ల GAVలు వరుసగా 10, 20, 30 లక్షలు అనుకుంటే.. B, C లను స్వీయ ఆస్తులుగా డిక్లేర్ చేయాలి. తద్వారా పన్ను భారం తగ్గుతుంది.


Click it and Unblock the Notifications