ఫుల్ జోష్... 5 మిలియన్ డౌన్ లోడ్లు దాటిన డైలీ హంట్ మొబైల్ యాప్ జోష్!

టిక్ టాక్ ను భారత్ లో నిషేధించడంతో ప్రస్తుతం సరిగ్గా అలాంటి ఫీచర్లు కలిగిన మొబైల్ యాప్ లకు డిమాండ్ పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రంగంలో ప్రస్తుతం గోల్డ్ రష్ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే టిక్ టాక్ వంటి ఫీచర్లలతో వీడియో యాప్ లను డెవలప్ చేసిన కంపెనీలకు ఇదొక జాక్ పాట్ లా మారిపోయింది. ప్లే స్టోర్ లో పెట్టిన కొద్దీ రోజుల్లోనే ఒక్కో మొబైల్ అప్ లక్షల డౌన్ లోడ్లను సాధిస్తోంది.

ఇందుకు తాజా ఉదాహరణే డైలీ హంట్ గ్రూప్ నకు చెందిన షార్ట్ వీడియో యాప్ 'జోష్'. దీనిని ఈ నెల 4 వ తేదీన ప్లే స్టోర్ లో పెడితే ఇప్పటికే 5 మిలియన్ డౌన్లోడ్లు దాటేసి రికార్డులు సృష్టిస్తోంది. టిక్ టాక్ మొబైల్ యాప్ కు జోష్ కు చాలా దగ్గరి పోలికలు ఉండటంతో వినియోగదారులు ఈ మొబైల్ యాప్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంత తక్కువ సమయంలో అత్యధిక డౌన్లోడ్లను సాధించిన జోష్... ఇండియా లో టిక్ టాక్ కు ప్రత్యామ్నాయం అయినా ఆశ్చర్యపోనక్కరలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది పూర్తిగా స్వదేశీ యాప్ కావటం విశేషం.

14 భాషల్లో అందుబాటులో ...

14 భాషల్లో అందుబాటులో ...

డైలీ హంట్ గ్రూప్ ఇండియా లోనే న్యూస్ అగ్గ్రిగేటరీ సేవల్లో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీలోకి భారీగా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు కూడా వచ్చాయి. గోల్డ్ మాన్ సాచ్ వంటి దిగ్గజ సంస్థలు ఇందులో పెట్టుబడి పెట్టాయి. కాబట్టి, కంటెంట్ క్రియేషన్, డెవలప్మెంట్ రంగంలో తనకు తిరుగులేదు అని నిరూపించుకొంటోంది ఈ సంస్థ. తాజాగా ప్రవేశ పెట్టిన జోష్ యాప్ కూడా అలాగే పోటీదారులతో పోల్చితే మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది.

జులై 4న ప్లే స్టోర్ లో ఉంచిన జోష్ యాప్ ను కేవలం 15 రోజుల్లోనే 50 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకోవటం విశేషం. జోష్ యాప్ తెలుగు సహా దేశంలోని 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండటం మరో విశేషం. ఈ వివరాలతో ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. వినియోగదారులు కేవలం ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికే పరిమితం అవటం లేదు. వారు దీనిని విరివిగా ఉపయోగిస్తుండటం విశేషం.

30 లక్షల వ్యూస్...

30 లక్షల వ్యూస్...

జోష్ కు పెరుగుతున్న ఆదరణకు ఒక మంచి ఉదాహరణే... ఇప్పటికే ఈ యాప్ లో అప్లోడ్ చేసిన కంటెంట్ కు 30 లక్షల కు పేజీ వ్యూస్ లభించటం. సహజంగా ఒక అప్ 1 మిలియన్ డౌన్ లోడ్లు సాధించటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది అనతి కాలంలోనే 5 మిలియన్ డౌన్లోడ్లు సాధించటం తో పాటు యాప్ కంటెంట్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభిస్తున్నాయంటే టిక్ టాక్ కు ఇది ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టిక్ టాక్ ని నిషేధించటం వల్ల తాత్కాలికంగా దాని వినియోగదారులు ఇతర షార్ట్ వీడియో మొబైల్ యాప్ ల వైపు వెళుతుండటం నిజమే కానీ... వారిని ఎక్కువ కాలం ఎంగేజ్ చేయాలంటే మాత్రం యాప్ లో దమ్ము ఉండాలి. ఎప్పటిపైకప్పుడు ఆసక్తికరమైన మార్పులు చేస్తుండాలి. లేదంటే వినియోగదారులకు మెప్పించటం కష్టం. ఈ విషయంలో జోష్ ఇప్పటికే తదుపరి స్థాయికి చేరుకున్నట్లు అంచనా వేస్తున్నారు.

దిగ్గజాల పోటీ...

దిగ్గజాల పోటీ...

షార్ట్ వీడియో రంగంలో ప్రస్తుతం నెలకొన్న గ్యాప్ ను పూరించేందుకు బడా కంపెనీలన్నీ సిద్ధమయ్యాయి. టైమ్స్ ఇంటర్నెట్ కూడా ఇప్పటికే తన షార్ట్ వీడియో మొబైల్ యాప్ ఎంఎక్స్ టకాటక్ ను ప్లే స్టోర్ లో ప్రవేశపెట్టింది. హాట్ షాట్ అనే ఒక ఫీచర్ రూపంలో దీనిని తన మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ గానా లో ఇంటిగ్రేట్ చేసింది. మరోవైపు షేర్ చాట్ నుంచి మోజ్ అనే యాప్ అందుబాటులోకి వచ్చింది.

జీ గ్రూప్ నుంచి జీ5 మొబైల్ యాప్ ఉండనే ఉంది. ఇదిలా ఉండగా... టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లను భారత్ లో నిషేధించిన వెంటనే దేశీయ మొబైల్ అప్ లు రోపోసో, మిత్రోన్, చింగారి వంటి యాప్స్ సందడి చేశాయి. కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ వినియోగదారులను సంపాదించాయి. ఇప్పుడు ఈ పోటీలోకి డైలీ హంట్ కు చెందిన జోష్ కూడా చేరిపోయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+