రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోను బిట్ కాయిన్ వ్యాల్యూ నేడు లాభపడింది. క్రిప్టోలు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. నేటి ప్రారంభంలో బిట్ కాయిన్ క్షీణించినప్పటికీ ఆ తర్వాత లాభపడింది. బిట్ కాయిన్ ఓ సమయంలో 3 శాతానికి పైగా ఎగిసి 45,000 డాలర్లను దాటింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభంలో క్రిప్టో మార్కెట్ పడిపోయినప్పటికీ, ఆ తర్వాత క్రమంగా లాభాల్లోకి వచ్చింది. నిన్నటి సెషన్లోనే బిట్ కాయిన్ 39వేల డాలర్ల నుండి 44వేల డాలర్లకు వచ్చింది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 44,295 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత 24 ంగటల్లో 43,248 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 45,304 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఇరవై నాలుగు గంటల్లో 840 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ క్యాప్ పెరిగింది. బిట్ కాయిన్ 52 వారాల గరిష్టం 68,990 డాలర్లు, కనిష్టం 28,825 డాలర్లు.

వివిధ క్రిప్టోల విషయానికి వస్తే బిట్ కాయిన్ 0.41 శాతం లాభపడి 44,140 డాలర్లు, టెర్రా 7.89 శాతం ఎగిసి 95.04 డాలర్లు, సోలానా 2.97 శాతం ఎగిసి 101.52 డాలర్లు, పాలీగోన్ 2.49 శాతం ఎగిసి 1.65 డాలర్లు, చైన్ లింక్ 0.20 శాతం ఎగిసి 15.47 డాలర్లు లాభపడింది. ఎథేరియం 0.23 శాతం క్షీణించి 2967 డాలర్లు, ఎక్స్ఆర్పీ 2.30 శాతం నష్టపోయి 0.76 డాలర్లు, అవాలాంచె 4.34 శాతం క్షీణించి 83.42 డాలర్లు, కార్డానో 2.78 శాతం క్షీణించి 0.948 డాలర్లు, పోల్కాడాట్ 1.56 శాతం క్షీణించి 18.63 డాలర్లు, స్టెల్లార్ 2.66 శాతం క్షీణించి 0.1937 డాలర్లు, డోజీకాయిన్ 1.49 శాతం క్షీణించి 0.13241 డాలర్లు, షిబా ఇను 3.84 శాతం క్షీణించి 0.000026 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications