40,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ పరుగు
క్రిప్టో కరెన్సీ నేడు పుంజుకుంది. ఒకటి రెండు మినహా దాదాపు అన్ని క్రిప్టోలు కూడా పరుగు పెట్టాయి. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను రెండు శాతం వరకు లాభపడ్డాయి. టెర్రా, టెర్రా యూఎస్‌డీ మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయానికి ముందు క్రిప్టో కరెన్సీ పుంజుకుంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 40,000 డాలర్లను క్రాస్ చేసింది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 4.21 శాతం లాభపడి 40,484.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 38,514 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 41,693 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 768.56 బిలియన్ డాలర్లు పెరిగింది. బిట్ కాయిన్ 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, కనిష్టం 28,825.76 డాలర్లు.

గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ 4.53 శాతం లాభపడి 40,514 డాలర్లు, ఎథేరియం 5.95 డాలర్లు ఎగిసి 2685 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 1.21 శాతం ఎగిసి 0.7696 డాలర్లు, సోలానా 4.08 శాతం ఎగిసి 83.57 డాలర్లు, అవాలాంచె 5.10 శాతం ఎగిసి 70.91 డాలర్లు, కార్డానో 3.06 శాతం ఎగిసి 0.8131 డాలర్లు, పోల్కాడాట్ 5.55 శాతం ఎగిసి 18.20 డాలర్లు, డోజీకాయిన్ 1.81 శాతం ఎగిసి 0.113 డాలర్లు, షిబా ఇను 2.57 శాతం ఎగిసి 0.000022 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications