బిట్ కాయిన్ నష్టాల్లో, డోజీకాయిన్ అదరగొట్టింది
క్రిప్టో కరెన్సీ గత ఇరవై నాలుగు గంటల్లో 2 శాతం నుండి 5 శాతం మేర క్షీణించింది. ఈ వార్త రాసే సమయానికి క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 2.81 శాతం క్షీణించి 45,319 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ 44,436 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 47,183 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ 2.81 శాతం మేర క్షీణించింది. 52 వారాల గరిష్టం 68,990.90, కనిష్టం 28,825.76 డాలర్లు. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 861.23 బిలియన్ డాలర్లు క్షీణించింది.
వివిధ క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే ఎథేరియం 4.83 శాతం క్షీణించి 3345 డాలర్లు, టెర్రా 0.73 శాతం క్షీణించి 114.76 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 2.41 డాలర్లు క్షీణించి 0.80 డాలర్లు, సోలానా 6.25 శాతం క్షీణించి 124.13 డాలర్లు, కార్డానో 5.07 శాతం క్షీణించి 1.14 డాలర్లు, అవాలాంచె 6.00 శాతం క్షీణించి 89.24 డాలర్లు, పోల్కాడాట్ 6.12 శాతం క్షీణించి 21.36 డాలర్లు వద్ద ట్రేడ్ అయింది. మీమ్ కాయిన్ డోజీకాయిన్ మాత్రం 6.06 శాతం ఎగబాకి 0.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మరో మీమ్ కాయిన్ షిబా ఇను మాత్రం 2.30 డాలర్లు క్షీణించి 0.000026 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

నేటి టాప్ గెయినర్స్ విషయానికి వస్తే డోజీకాయిన్ 6 శాతం లాభపడింది. మరో క్రిప్టో పాక్సోస్ స్టాండర్డ్ అతి స్వల్పంగా లాభపడింది. మిగతా అన్నీ నష్టాల్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే డిస్ట్రిక్ట్-ఓఎక్స్ 16 శాతం, స్కేల్ 15.91 శాతం, సీలో 12.40 శాతం, ఓఎక్స్ 10.18 శాతం, సింథెటిక్స్ 10.09 శాతం, ఐకాన్ 10.07 శాతం, స్టోర్జ్ 10.04 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications