క్రిప్టో కరెన్సీ ధరలు, 39,000 డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్
క్రిప్టో కరెన్సీ మళ్లీ క్షీణించింది. నిన్న 42,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్ నేడు తిరిగి 40,000 మార్కు దిగువకు పడిపోయింది. నిన్న 10 శాతానికి పైగా లాభపడిన ఈ క్రిప్టో దిగ్గజం నేడు దాదాపు అంతేస్థాయిలో పడిపోయింది. బిట్ కాయిన్ గత 24 గంటల్లో 38,823 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 42,577 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ వార్త రాసే సమయానికి 39,155 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 743.13 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ క్షీణించింది. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు, 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు.
వివిధ క్రిప్టో వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 6.43 శాతం క్షీణించి 39,304 డాలర్లు, ఎథేరియం 5 శాతం క్షీణించి 2606 డాలర్లు, టెర్రా 2.82 శాతం ఎగిసి 95.35 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 2.03 శాతం క్షీణించి 0.735 డాలర్లు, సోలానా 5.96 శాతం తగ్గి 82.55 డాలర్ల వద్ద, అవాలాంచె 6.31 శాతం క్షీణించి 73.03 డాలర్లు, కార్డానో 3.87 శాతం క్షీణించి 0.811 డాలర్లు, పోల్కాడాట్ 4.36 శాతం క్షీణించి 17 డాలర్లు, స్టెల్లార్ 1.02 శాతం 0.177 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 4.33 శాతం క్షీణించి 0.116 డాలర్ల వద్ద, షిబా ఇను 5.23 డాలర్లు క్షీణించి 0.000023 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

నేటి టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఐకాన్ 33 శాతం, ఒమిస్ గో 16 శాతం, లిస్క్ 9.68 శాతం, బిట్ కాయిన్ గోల్డ్ 3.61 శాతం, ఐవోటా 0.80 శాతం ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో మోనెరో 12.56 శాతం, కైబర్ నెట్ వర్క్ 12.31 శాతం, దిగ్రాప్ 8.71 శాతం, కర్వ్ డావ్ టోకెన్ 8.42 శాతం, ఆరాగోన్ 8.35 శాతం, కాంపౌండ్ 8.28 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications