Crypto Price: 41,000 డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్
క్రిప్టో మార్కెట్ క్షీణిస్తోంది. ఇటీవల 45,000 డాలర్లు క్రాస్ చేసిన క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ఇప్పుడు తిరిగి 40,000 డాలర్ల స్థాయికి పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఉక్రెయిన్‌కు చెందిన కీలక నగరాలను పుతిన్ సేన స్వాధీనం చేసుకోవడం, రష్యాపై అమెరికా, యూరోపియన్ దేశాల ఆంక్షల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్ నష్టపోతుండగా, క్రిప్టో కరెన్సీ కూడా ఊగిసలాటలో ఉంది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 5.48 శాతం నష్టపోయి 40,796.23 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ 43,163.34 డాలర్ల వద్ద గరిష్టాన్ని, 40,583.33 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 774.52 బిలియన్ డాలర్లు క్షీణించింది. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు, గరిష్టం 68,990.90 డాలర్లు.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 5.34 శాతం క్షీణించి 40,821 డాలర్లు, ఎథేరియం 5.75 శాతం క్షీణించి 2,683 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 3.97 శాతం క్షీణించి 0.732178 డాలర్లు, టెర్రా 1.70 శాతం క్షీణించి 90.40 శాతం, సోలానా 4.60 శాతం క్షీణించి 91.37 డాలర్లు, కార్డానో 4.76 శాతం క్షీణించి 0.870 డాలర్లు, పోల్కాడాట్ 6.92 శాతం క్షీణించి 17.04 డాలర్లు, స్టెల్లార్ 4.72 శాతం క్షీణించి 0.1812.09 డాలర్లు, డోజీకాయిన్ 3.96 శాతం క్షీణించి 0.125754 డాలర్ల, షిబా ఇను 4.41 శాతం క్షీణించి 0.000024 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అవాలాంచే మాత్రమే 0.21 శాతం ఎగిసి 78.84 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications