కొద్ది రోజుల్లోనే 7000 డాలర్లు క్షీణించిన బిట్ కాయిన్
క్రిప్టో కరెన్సీ భారీగా పడిపోతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం పసిడి మార్కెట్, క్రిప్టో మార్కెట్, స్టాక్ మార్కెట్ పైన పడుతోంది. కేవలం గోల్డ్ మార్కెట్ పైన మాత్రమే సానుకూల ప్రభావం చూపుతోంది. స్టాక్, క్రిప్టో మార్కెట్ పైన వ్యతిరేక ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బిట్ కాయిన్, ఎథేరియం సహా వివిధ క్రిప్టో కరెన్సీలు పడిపోయాయి. బిట్ కాయిన్ ఇటీవల 45,000 డాలర్లు దాటి, మళ్లీ 38,.000 డాలర్ల స్థాయికి పడిపోయింది.
ఈ వార్త రాసే సమయానికి క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 2.25 శాతం క్షీణించి 38,245 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల కనిష్టం 38,132.14 డాలర్లు, 24 గంటల గరిష్టం 39,678.90 డాలర్లు. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు కాగా, 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు. మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఇరవై నాలుగు గంటల్లో 725.75 బిలియన్ డాలర్లు క్షీణించింది.

వివిధ క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే బిట్ కాయిన్ 2.11 శాతం 38,319 డాలర్లు, ఎథేరియం 1.71 శాతం క్షీణించి 2,603 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 0.19 శాతం క్షీణించి 0.733399 డాలర్లు, టెర్రా 3.40 శాతం క్షీణించి 82.59 డాలర్లు, సోలానా 2.01 శాతం క్షీణించి 86.87 డాలర్ల వద్ద, అవాలాంచె 2.99 శాతం క్షీణించి 75.08 డాలర్లు, కార్డానో 3.52 శాతం క్షీణించి 0.835500 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 1.67 శాతం క్షీణించి 16.73 డాలర్ల వద్ద, స్టెల్లార్ 0.38 శాతం క్షీణించి 0.175630 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 0.99 శాతం క్షీణించి 0.122522 డాలర్ల వద్ద, పోలీగాన్ 1.99 శాతం క్షీణించి 1.46 డాలర్ల వద్ద, షిబా ఇను 0.44 శాతం క్షీణించి 0.000024 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications