Crypto Prices Today: 39,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్, డోజీకాయిన్ డౌన్
క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పుంజుకుంది. బిట్ కాయిన్‌తో పాటు ఎథేరియం, ఇతర క్రిప్టోలు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఒకటి రెండు క్రిప్టోలు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను మాత్రం అరశాతం మేర నష్టపోయాయి. గత 24 గంటల్లో అత్యధికంగా లాభపడిన క్రిప్టోల్లో వేవ్స్ 13 శాతం, రెన్ 6.24 శాతం, యెర్న్ ఫైనాన్స్ 6 శాతం లాభపడ్డాయి. అలాగే, అత్యధికంగా నష్టపోయిన వాటిలో కీప్ నెట్ వర్క్ 5 శాతం, ఎక్స్‌వైవో నెట్ వర్క్ 4.63 శాతం, చిలిజ్ 4.51 శాతం ఉన్నాయి.
మార్కెట్ క్యాప్ పరంగా లాభపడిన క్రిప్టోల్లో బిట్ కాయిన్ 1.11 శాతం ఎగిసి 39,167 డాలర్లు, ఎథేరియం 0.74 శాతం లాభపడి 2,641 డాలర్లు, ఎక్స్ఆర్‌పీ 1.86 శాతం క్షీణించి 0.748810 డాలర్లు, అవాలంచే 1.18 శాతం ఎగిసి 76.23 డాలర్ల వద్ద, కార్డానో 0.88 శాతం ఎగిసి 0.8452 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 1.77 శాతం ఎగిసి 17.10 డాలర్ల వద్ద, పాలీగాన్ 1.47 శాతం ఎగిసి 1.49 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నష్టపోయిన వాటిలో డోజీకాయిన్ 2.36 శాతం క్షీణించి 0.122 డాలర్ల వద్ద, షిబా ఇను 0.18 శాతం తగ్గి 0.000024 డాలర్ల వద్ద, టెర్రా 0.82 శాతం క్షీణించి 83.41 డాలర్ల వద్ద, సోలానా 1.07 శాతం క్షీణించి 86.32 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయఇన్ 0.49 శాతం లాభపడి 39,073 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో కనిష్టం 37,600 డాలర్లు, గరిష్టం 39,350 డాలర్లు. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు, గరిష్టం 68,990.90 డాలర్లు. ఇరవై నాలుగు గంటల్లో 740.11 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ పెరిగింది.


Click it and Unblock the Notifications