For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా నష్టపోయిన క్రిప్టో కరెన్సీ: ఈ కాయిన్ 24 గంటల్లో 10,000 రెట్లు జంప్

|

క్రిప్టో కరెన్సీ క్షీణిస్తోంది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం (డిసెంబర్ 20) 2.19 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ వ్యాల్యూ నేటి ప్రారంభ సెషన్‌లో 46,627.84 డాలర్ల వద్ద కనిపించింది. అయితే ఆ తర్వాత సెషన్‌లలో మరింత పడిపోయి 45,868.40 డాలర్ల స్థాయికి వచ్చింది.

నేటి ఉదయం సెషన్‌లో బిట్ కాయిన్ 46,000 డాలర్ల వద్ద కదలాడింది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం 3900 డాలర్ల దిగువకు వచ్చింది. ఎథేరియం 3,805 డాలర్ల వద్ద కదలాడింది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ 2.10 శాతం, ఎథేరియం 2.68 శాతం పతనమైంది. అదే సమయంలో గత వారంలో బిట్ కాయిన్ 5.61 శాతం, ఎథేరియం 5.06 శాతం క్షీణించింది. బియాన్స్ కాయిన్, పోల్కాడాట్, కార్డానో సహా ఇతర క్రిప్టోలు కూడా క్షీణించాయి. మీమ్ కాయిన్స్ షిబా ఇను, డోజీకాయిన్స్ కూడా నష్టపోయాయి.

Crypto

గత 24 గంటల్లో భారీగా లాభపడిన క్రిప్టోలు

ఆండ్రోమేడా - 10,889 రెట్లు ఎగిసి 0.1472 డాలర్లకు చేరింది.

ప్లస్పాడ్ 681 రెట్లు ఎగిసి 0.003513 డాలర్ల వద్ద ఉంది.

షిబా ఇను ఎంపైర్ 192 రెట్లు, మైస్ 178 రెట్లు, మెటాఫలిప్ 177 రెట్లు, క్రాస్ చైన్ క్యాపిటల్ 140 రెట్లు లాభపడ్డాయి.

ఇక, భారీగా నష్టపోయిన వాటిలో వానామూన్ 79 శాతం, బేబీ వాకాండ ఇను 70 శాతం, ఆల్ బెస్ట్ ఇసో 70 శాతం, బ్లాక్ క్లౌడ్ 60 శాతం, కిట్టీ ఫైనాన్స్ 60 శాతం, సిరెక్స్ 60 శాతం నష్టపోయాయి.

English summary

భారీగా నష్టపోయిన క్రిప్టో కరెన్సీ: ఈ కాయిన్ 24 గంటల్లో 10,000 రెట్లు జంప్ | Crypto prices today: Bitcoin, Ether extend cuts

The cryptocurrency market was trading mixed on Monday, following muted trade in the weekend. The digital token market was bleeding as investors were on their toes amidst weakness in riskier asset classes and Fed's hawkish view.
Story first published: Monday, December 20, 2021, 20:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X