Crypto prices: ఈ క్రిప్టో కరెన్సీలు ఏడు రోజుల్లో 30% జంప్ చేశాయి
క్రిప్టో కరెన్సీ మార్కెట్ నేడు పరుగు పెట్టింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ప్రస్తుతం మూడు వారాల గరిష్టం వద్ద ఉంది. వరల్డ్ సెకండ్ అతిపెద్ద క్రిప్టో ఎథేరియం కూడా భారీగా ఎగిసిపడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం క్రిప్టో మార్కెట్ పైన కూడా కనిపించింది. అయితే గత వారం రోజుల్లో కొన్ని క్రిప్టోలు మాత్రం 30 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చాయి. బిట్ కాయిన్, అవాక్స్, సోలానా, ఏడీఏ, ఎక్స్‌ఆర్‌పీ, ఎథేరియం, బీఎన్‌బీలు గత వారం రోజుల్లో ఇన్వెస్టర్లకు ముప్పై శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చాయి.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 4.19 శాతం ఎగబాకి 42,918.77 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత 24 గంటల్లో 40,777.90 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 43,300 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ గత 24 గంటల్లో $816.05 బిలియన్ డాలర్లు పెరిగింది.

నేడు వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 4.14 శాతం, ఎథేరియం 3.16 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 3.71 శాతం, సోలానా 1.86 శాతం, కార్డానో 6.14 శాతం, పోల్కాడాట్ 6.35 శాతం, పాలీగాన్ 2.21 శాతం, షిబా ఇను 2.67 శాతం, యాక్సీ ఇన్ఫినిటీ 1.49 శాతం, లైట్ కాయిన్ 6.05 శాతం లాభపడ్డాయి. టెర్రా మాత్రమే 1.73 శాతం నష్టపోయింది.


Click it and Unblock the Notifications