Crypto Price Today: 3 నెలల గరిష్టానికి బిట్ కాయిన్, ఇవి 9 శాతం జంప్
క్రిప్టో కరెన్సీ దూసుకెళ్తోంది. వరల్డ్ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ 47,000 డాలర్లను దాటేసింది. రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 3300 డాలర్లకు పైనే ఉంది. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇనులు 6 శాతానికి పైగా ఎగిశాయి. గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలు కూడా 3 శాతం నుండి పది శాతం మేర ఎగిసిపడ్డాయి. కేవలం టెర్రా యూఎస్‌డీ, వేవ్స్ క్రిప్టోలు మాత్రమే స్వల్పంగా నష్టపోయాయి. దాదాపు అన్నీ లాభాల్లోనే ఉన్నాయి.
బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి 47,141.04 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో కనిష్టం 44,454.48 డాలర్లు, గరిష్టం 47,524.31 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు కాగా, ఆల్ టైమ్ గరిష్టం 68,990.90 డాలర్లు. 52 వారాల గరిష్టం కూడా ఇదే. బిట్ కాయిన్ నేడు 5.60 శాతం మేర లాభపడింది. బిట్ కాయిన్, ఎథేరియం, సోలానా సహా వివిధ క్రిప్టోలు మూడు నెలల గరిష్టాన్ని తాకాయి.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 5.76 శాతం లాభపడి 47,156 డాలర్లు, ఎథేరియం 6.10 శాతం ఎగిసి 3,338 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 3.60 శాతం లాభపడి 0.866 శాతం, టెర్రా 4.81 శాతం ఎగిసి 95.07 శాతం, సోలానా 8.90 శాతం లాభపడి 110.27 డాలర్లు, కార్డానో 4.57 శాతం లాభపడి 1.19 శాతం, అవాలాంచె 6 శాతం ఎగిసి 91.04 డాలర్లు, పోల్కాడాట్ 9.45 శాతం ఎగిసి 23 డాలర్ల, డోజీకాయిన్ 7.02 శాతం లాభపడి 0.15 డాలర్లు, షిబా ఇను 7.88 శాతం ఎగిసి 0.000027 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications