Crypto prices: ఈ క్రిప్టో కరెన్సీలు ఏడు రోజుల్లో 30% జంప్ చేశాయి
క్రిప్టో కరెన్సీ మార్కెట్ నేడు పరుగు పెట్టింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ప్రస్తుతం మూడు వారాల గరిష్టం వద్ద ఉంది. వరల్డ్ సెకండ్ అతిపెద్ద క్రిప్టో ఎథేరియం కూడా భారీగా ఎగిసిపడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం క్రిప్టో మార్కెట్ పైన కూడా కనిపించింది. అయితే గత వారం రోజుల్లో కొన్ని క్రిప్టోలు మాత్రం 30 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చాయి. బిట్ కాయిన్, అవాక్స్, సోలానా, ఏడీఏ, ఎక్స్‌ఆర్‌పీ, ఎథేరియం, బీఎన్‌బీలు గత వారం రోజుల్లో ఇన్వెస్టర్లకు ముప్పై శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చాయి.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 4.19 శాతం ఎగబాకి 42,918.77 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత 24 గంటల్లో 40,777.90 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 43,300 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ గత 24 గంటల్లో $816.05 బిలియన్ డాలర్లు పెరిగింది.



Click it and Unblock the Notifications