క్రిప్టో కరెన్సీ పెట్టుబడులను పూర్తిగా నిషేధించకుండా పన్ను పరిధిలోకి తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాలను సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చైనా తరహా క్రిప్టో నిషేధానికి బదులు భారత్ లోపల, వెలుపల క్రిప్టో పెట్టుబడులపై పన్నును విధించాలని యోచిస్తోంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 26ఏ, పన్ను చెల్లింపుదారులు చేసిన అన్ని పెట్టుబడుల డేటాను కలిగి ఉండేలా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్‌ను(AIR) పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిని సవరించనుంది. దీనిని ట్యాక్స్ పాస్ బుక్ అని పిలుస్తారు.
అలాగే, ఐటీ చట్టంలో అవసరమైన అన్ని సెక్షన్లలో క్రిప్టోకరెన్సీ, క్రిప్టో ఆస్తులు, డిజిటల్ కరెన్సీ వంటి పదాలను కూడా జోడించాలనే ప్రతిపాదన కూడా ఉందని తెలుస్తోంది. అంటే, పన్ను రిటర్న్స్ దాఖలు చేసేవారు క్రిప్టోల్లో ట్రేడింగ్ లేదా పెట్టుబడులపై ఆదాయాన్ని ప్రత్యేకంగా వెల్లడించవలసి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్, రికరింగ్ డిపాజిట్స్, ఆభరణాల్లో రూ.2 లక్షలు, అంతకుమించి పెట్టుబడులకు AIR నియమావళి వర్తిస్తుంది.

భారత్‌లో బిట్ కాయిన్, ఎథేరియం సహా వివిధ క్రిప్టోలపై పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో దీనిని నిషేధించే బదులు పన్ను పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోందట. భారత్ లేదా విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజీల ద్వారా వీటిలో పెట్టుబడులపై ప్రభుత్వం పన్ను వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications