కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ మే 1వ తేదీ నుండి వ్యాక్సీన్ ఇస్తారు. ఇప్పటికే కరోనా రోగులకు సేవలు అందించే వైద్యులకు, సహాయకులకు, వివిధ సేవల్లోని కార్మికులకు, 40 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది.. కొనసాగుతోంది.
ఇప్పుడు మే 1వ తేదీ నుండి పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ మేరకు కేంద్రం గురువారం ప్రకటించింది. ఏప్రిల్ 28వ తేదీ నుండి ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం కో-విన్, ఆరోగ్యసేతు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది.

రిజిస్ట్రేషన్
వయస్సు ప్రమాణాలు, ఇతర కొన్ని ఫీచర్స్‌లో మార్పులు చేశారు. అందరికీ టీకాను అందుబాటులోకి తెచ్చాక డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్‌కు అనుగుణంగా కో-విన్ ప్లాట్‌ఫామ్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం థర్డ్ ఫేజ్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కోసం ఏప్రిల్ 28వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీ నుండి 18 నుండి 45 ఏళ్ల వయస్సు వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఈ ఏజ్ గ్రూప్ వారికి ఎలాంటి వాక్-ఇన్ రిజిస్ట్రేషన్ లేదు.

ఒక డోస్‌కు రూ.250
మే 1వ తేదీ నుండి ప్రయివేటు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సెంటర్లకు ప్రభుత్వం నుండి కరోనా డోస్ అందుతుంది. వీటికి ఒక డోస్‌కు రూ.250 ఛార్జ్ చేస్తారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగా ఇస్తారు. వీరికి కేంద్ర ప్రభుత్వం నుండి డోస్‌లు వస్తాయి.
వ్యాక్సీన్ తయారీదారులు మే 1వ తేదీకి ముందు బహిరంగ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉండే 50 శాతం సరఫరా కోసం ముందస్తు ప్రకటన చేస్తారు. ఈ ధర ఆధారంగా రాష్ట్రాలు, ప్రయివేటు ఆసుపత్రులు, పారిశ్రామిక తయారీ సంస్థలు తయారీదారుల నుండి వ్యాక్సీన్ మోతాదును సేకరించవచ్చు.

టీకా విధానం సరళీకృతం కానీ...
టీకా విధానాన్ని సరళీకృతం చేసినప్పటికీ ఈ టీకాలు బహిరంగ మార్కెట్లోని ఫార్మాసిస్ట్ లేదా కెమిస్ట్ షాపుల్లో విక్రయించబడతాయని కాదు. ప్రయివేటు ఆసుపత్రులు వేసే టీకాల ధరలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. వ్యాక్సీన్ తయారీదారులు తమ నెలవారీ సెంట్రల్ డ్రగ్స్ లేబోరేటరీస్‌లో 50 శాతం మోతాదును భారత ప్రభుత్వానికి సరఫరా చేస్తాయి. మిగిలిన 50 శాతం మోతాదును రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్లో సరఫరాకు వెసులుబాటు ఉంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..



Click it and Unblock the Notifications