ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం దాదాపు కనిపిస్తోంది. లక్షలమందికి మహమ్మారి రావడంతో పాటు, 65 వేలమందికి పైగా చనిపోయారు. మన దేశంలో వివిధ కారణాల వల్ల కేసుల సంఖ్య ఎక్కువ లేదు. మృతుల సంఖ్య ఎన్నో దేశాలతో పోలిస్తే మన వద్ద బాగుంది. ఈ విషయం పక్కన పెడితే అగ్రదేశం అమెరికా, చైనా వంటి వివిధ దేశాల్లో కోట్లాది లక్షలాది ఉద్యోగాలు ఊడిపోతాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నట్లు ప్రపంచ కార్మిక సమాఖ్య అంచనా. అయితే ఈ ప్రభావం ఇంకా మన దేశంలో కనిపించడం లేదు. కానీ ముందుందు అసలు సమస్య అంటున్నారు.

ఆదాయం, భారీగా తగ్గే అవకాశం
లాక్ డౌన్ ఎత్తివేద అనంతరం పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయే ప్రమాదముందని CII సీఈవో స్నాప్ పోల్ సర్వేలో వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పోతాయని 52 శాతం కార్పోరేట్ కంపెనీల బాస్‌లు చెప్పారట. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ఆదాయం, లాభాలు భారీగా తగ్గే అవకాశముందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి.

డిమాండ్ సాధారణ స్థితికి వచ్చేందుకు సమయం
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత డిమాండ్ తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు సమయం పడుతుందని భావిస్తున్నాయి కంపెనీలు. ఇది ఉద్యోగాల కోతకు దారి తీయవచ్చునని సీఐఐ సీఈవో స్నాప్ పోల్ సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేను ఎలక్ట్రానిక్ మోడ్‌లో నిర్వహించారు.

ఉద్యోగాలు పోవని 46 శాతం మంది
సర్వేలో పాల్గొన్నవారిలో 46 శాతం మంది సీఈవోలు ఉద్యోగాల తొలగింత అంతగా ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. 2 శాతం మంది చెప్పలేమని వెల్లడించారు. 52 శాతం మాత్రం జాబ్ కట్ ఉంటుందన్నారు.

ఉద్యోగాలు ఎంత వరకు పోవచ్చు?
లాక్ డౌన్ తర్వాత 15 శాతం ఉద్యోగాలు పోవచ్చునని 47 శాతం మంది అభిప్రాయపడ్డారు. 15 శాతం నుండి 30 శాతం ఊడిపోవచ్చునని 32 శాతం మంది అభిప్రాయపడ్డారు.

లాభాల తగ్గుదల
ఇప్పటికే ఉన్న నిల్వల విషయమై మాట్లాడుతూ.. లాక్ డౌన్ తర్వాత పరిస్థితి చక్కబడేందుకు 30 రోజులు పట్టవచ్చునని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు. అంటే నెల రోజుల వరకు నిల్వల్లో మార్పు ఉండకపోవచ్చునని చెప్పారు. ముప్పై రోజులు, ఆ తర్వాతనే డిమాండ్ పుంజుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. చాలా సంస్థల ఆదాయాలు నాలుగో త్రైమాసికంలో 10 శాతానికి మించి, లాభాలు 5 శాతానికి మించి తగ్గుతాయని వెల్లడించారు. 2020-21 మొదటి త్రైమాసికంలోను పరిస్థితి అలాగే ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.

ఉత్పత్తి, సరఫరా
లాక్ డౌన్ సమయంలో అత్యవసర ఉత్పత్తులు, సహాయక వస్తువులను తయారు చేస్తోన్న కంపెనీల్లో చాలా వాటికి తయారీ, సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ముఖ్యంగా అవసరమైన మేర కార్మికులు లభించడం లేదు. రవాణా అవరోధంగా మారిందని సీఈవోలు వెల్లడించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications