కరోనా వైరస్ నేపథ్యంలో మహమ్మారివ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బంగారం స్మగ్లింగ్ గణనీయంగా తగ్గిందట. గత ఏడాది 120 టన్నుల బంగారం దొంగచాటుగా దేశంలోకి దిగుమతి అయింది. కానీ ఈ ఏడాది నెలకు 2 టన్నుల చొప్పున ఏడాది మొత్తం మీద 25 టన్నులకే పరిమితం అవుతుందని అంచనా. ఈ మేరకు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ దేశీయ మండలి చైర్మన్ ఎన్ అనంత పద్మనాభన్ తెలిపారు.

స్మగ్లింగ్‌పై కరోనా దెబ్బ
కరోనా నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి జూన్ వరకు అంతర్జాతీయ విమానాలు నిలిచిపోవడంతో బంగారాన్ని అక్రమంగా తరలించే వారికి మార్గాలు లేకుండాపోయాయి. ఆభరణాల దుకాణాలు కూడా మూసివేయడంతో, దేశీయంగా డిమాండ్ లేదు. నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ నుండి కొద్ది మొత్తాల్లో నేల, నీటి మార్గాల్లో బంగారం దొంగచాటుగా వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల బంగారంపై దిగుమతి సుంకాన్ని శ్రీలంక రద్దు చేసింది. దీంతో అక్కడి నుండి స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వార్షిక బంగారం డిమాండ్‌లో 17 శాతం
గత ఏడాది స్మగ్లింగ్ మార్గంలో వచ్చిన బంగారం 120 టన్నులుగా ఉంటుందని అంచనా. దేశీయ వార్షిక పసిడి డిమాండ్‌లో ఇది 17 శాతం. ప్రపంచంలో అతిపెద్ద లాక్ డౌన్ భారత్‌లో విధించారు. దీంతో అక్రమ రవాణాపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఆరు నెలల కాలంలో విమానాల రాకపోకలు లేవని, అందుకే స్మగ్లింగ్ గోల్డ్ తగ్గిందని అనంత పద్మనాభన్ అన్నారు. ప్రస్తుతం విమానాశ్రయాల నుండి రావడం లేదని, భారత్ చుట్టుపక్కల దేశాల నుండి మాత్రమే ఉందని భావిస్తున్నారు.

50 శాతం తగ్గించాలి..
ఆర్థికమంత్రిత్వ శాఖ డేటా ఆధారంగా ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో భారతీయ విమానాశ్రయాలలో పట్టుబడిన స్మగ్లింగ్ బంగారం నెలవారీ సగటు ఆరు సంవత్సరాల కనిష్టానికి (20.6 కిలోలు)కు చేరుకుంది. 12.5 శాతం దిగుమతి ట్యాక్స్, లోకల్ ట్యాక్స్, అధిక ధరల వంటి వివిధ కారణాలు అక్రమ కొనుగోలుదారులకు అనుకూలంగా మారాయని అంటున్నారు. దిగుమతులను చట్టబద్దం చేసేందుకు, అక్రమ బంగారానికి అడ్డుకట్ట వేసేందుకు దిగుమతి సుంకాన్ని కనీసం 50 శాతం మేర తగ్గించాలని బంగారం వర్తకులు కోరుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications