కరోనా మహమ్మారి సంక్షోభం నుండి బయటపడేందుకు భారత్‌కు 200 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరమని ప్రభుత్వానికి అసోచామ్ సూచించింది. భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ప్యాకేజీయే అవసరమని తెలిపింది. రానున్న మూడు నెలల్లోనే 50 బిలియన్ డాలర్ల నుండి 100 బిలియన్ డాలర్ల క్యాష్ ఇన్‌ఫ్లో అవసరమని తెలిపింది.

పారిశ్రామికవర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ
ఈ మహమ్మారి కారణంగా కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయాయి. ఈ సంక్షోభం నుంచి కోలుకోవాలంటే భారీ ఉద్దీపనలు తప్పనిసరని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కరోనా కష్టాల నుంచి పేదలు, సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్రం గత నెల రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు ఆర్థికంగా లభించిన ఊరట లేదు. తమకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని పారిశ్రామికవర్గాలు కోరుతున్నాయి.

22.50 లక్షల కోట్ల ఉద్దీపనలు అవసరం
ప్రపంచ చరిత్రలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నామని, ప్యాకేజీ కూడా అదేస్థాయిలో ఉండాలని అసోచామ్ అభిప్రాయపడింది. వచ్చే 12 నెలల నుండి 18 నెలల్లో కనీసం 20,000 కోట్ల డాలర్ల (రూ.15 లక్షల కోట్లు) నుంచి 30,000 కోట్ల డాలర్ల (రూ.22.50 లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీ కల్పించాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ విజ్ఞప్తి చేశారు.

జీఎస్టీ రేటు తగ్గింపు
జీఎస్టీ రేటును కూడా తగ్గించాలని అసోచామ్ కోరింది. మూడు నెలల కాలానికి 50 శాతం, ఈ ఆర్థిక సంవత్సరంలో 25 శాతానికి తగ్గించాలని సూచించింది.

నిర్మలకు సూచనలతో లేఖ
కరోనా మహమ్మారిపై పోరుకు పలు సూచనలు చేస్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అసోచామ్ ప్రెసిడెంట్ డాక్టర్ నిరంజన్ హీరానందని లేఖ రాశారు. స్థూల జాతీయోత్పత్తి (GDP)లో 10 శాతం ఉద్దీపన చర్యలు ఉండాలని కోరారు. ఇందుకు భారత్‌కు 200 బిలియన్ డాలర్లకు పైగా అవసరమని పేర్కొన్నారు.

ఉద్యోగ నష్టాలు తగ్గించేందుకు..
రాబోయే 12-18 నెలల్లో 300 బిలియన్ డాలర్లు అవసరమన్నారు. రాబోవు మూడు నెలల్లో 50-100 బిలియన్ డాలర్లు వ్యవస్థలోకి పంపింగ్ చేయాల్సి ఉందన్నారు. ఉద్యోగ నష్టాలను తగ్గించేందుకు, ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు పై చర్యలు తీసుకోవాలని కోరారు.

క్లిష్ట సమయంలో..
భారీ ప్యాకేజీ ప్రకటించి, వ్యవస్థలోకి పంపించడం ద్వారానే వ్యాపారాలు, కార్మికులకు ఇలాంటి పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.
ప్రత్యక్ష బదలీ ద్వారా ఉద్యోగులు, లేబర్‌కు సహాయం, సంక్షోభం నుండి బయటపడేందుకు తగినంత నగదు ప్రవాహం ఉందని కంపెనీలకు ధీమా కల్పించడం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు పెట్టుబడులను ఉత్తేజపరిచేందుకు.. ఈ ప్యాకేజీ ఉపయోగమన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications