న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృభిస్తుండటంలో ఇటు జనజీవనం స్తంభించడమే కాకుండా అటు ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలులోకి రావడంతో దేశంలో ప్రధాన రంగాలు నష్టాల బాట పట్టాయి. అదే సమయంలో చాలా ప్రైవేట్ ప్రభుత్వ కంపెనీలు కూడా నష్టాలు చవిచూశాయి. ఇదిలా ఉంటే కరోనావైరస్ కారణంగా ఇప్పటికే పలువురు ఉద్యోగాలు కోల్పోయారు. కొద్ది రోజుల క్రితం జొమాటో స్విగ్గీలు తమ ఉద్యోగులను తొలగించిన ఘటన మరువక ముందే మరో ప్రముఖ చాటింగ్ యాప్ షేర్‌చాట్ తమ ఉద్యోగులకు గుడ్ బై చెప్పింది.
ప్రముఖ సోషల్ మీడియా ఇన్స్‌టాంట్ మెసేజింగ్ యాప్ షేర్ చాట్ 101 మంది ఉద్యోగస్తులకు గుడ్‌బై చెప్పేసింది. కరోనావైరస్‌తో అడ్వర్టైజ్‌మెంట్స్ లేక నష్టాలు చవిచూసిందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆ కంపెనీ చెప్పుకొచ్చింది. ఇక పరిస్థితి బాగాలేదని చెబుతూ దాదాపు 101 మంది ఉద్యోగస్తులకు బుధవారం ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. అంతేకాదు కాస్ట్ కటింగ్ వివరాలను కూడా ఆ మెయిల్‌లో పొందుపర్చింది. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన షేర్ చాట్ కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్స్ వేదికగా మోనెటైజింగ్‌కు గతేడాది అక్టోబర్‌లో వెళ్లింది. అయితే కోవిడ్-19 ప్రభావం యాడ్స్‌పై తీవ్రంగా పడిందని సంస్థ పేర్కొంది.

ప్రస్తుతం తమ ముందున్న ఏకైక లక్ష్యం నష్టాల్లో ఉన్న కంపెనీని కాపాడుకోవడమే అని చెప్పిన సంస్థ తప్పని పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇక కంపెనీ వృద్ధి బాటలో నడిచేందుకు తిరిగి ఫండమెంటల్స్ నుంచి ప్రారంభించాలని షేర్ చాట్ సహవ్యవస్థాపకులు సీఈఓ అంకుష్ సచ్‌దేవ చెప్పారు. ఇక కొత్త రెవిన్యూ టార్గెట్లను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇక ఉద్యోగులను తొలగించడం నిజంగా బాధగా ఉందని చెప్పారు. కానీ తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోందని చెప్పారు అంకుష్ సచ్‌దేవ
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న షేర్‌చాట్ ఇతర సోషల్ మీడియా సంస్థలైన ఫేస్‌బుక్, టిక్‌టాక్‌కు పోటీనిస్తోంది. గతేడాది ఆగష్టులో ట్విటర్ సంస్థతో పాటు ఇతర సంస్థలు షేర్‌చాట్‌లో 100 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ట్రస్ట్ బ్రిడ్జ్ పార్ట్‌నర్స్, షున్‌వే క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్, సైఫ్ క్యాపిటల్‌లు పెట్టుబడులు పెట్టిన వాటిలో ఉన్నాయి. భారత్‌లో షేర్ చాట్‌కు నెలకు 60 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications