ఢిల్లీ: మార్చి నెల పీఎఫ్ చందాల చెల్లింపుకు గడువు తేదీని మే 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. వాస్తవానికి ఈ గడువు తేదీ ఏప్రిల్ 15వ తేదీ ఉంది. అదనంగా మరో నెల రోజుల సమయాన్ని ఇచ్చింది. కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి నిరోధక ఆంక్షల నేపథ్యంలో మార్చి వేతనానికి సంబంధించి ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్ (ECR) సమర్పణకు గడువును 2020 మే 15వ తేదీ వరకు పొడిగించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

6 లక్షల కంపెనీలకు ఊరట
కేంద్ర కార్మిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 6 లక్షల కంపెనీలకు ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు చెల్లించలేని సంస్థలకు కొంత ఊరటను ఇచ్చేందుకు, ప్రోత్సాహం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. కంపెనీలు తాము ఏ తేదీన వేతనాలు చెల్లించాయో ECR రూపంలో ప్రకటించవలసి ఉంటుంది. కార్మిక శాఖ నిర్ణయంతో మార్చి నెల ECRను కంపెనీలు 2020 మే 15వ తేదీ లేదా ఆ లోగా సమర్పించవలసి ఉంటుంది.

12,000 కోట్ల లిక్విడిటీ ప్రయోజనం
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ భారీ ఊరట వల్ల వివిధ కంపెనీలకు రూ.12,000 కోట్ల లిక్విడిటీ ప్రయోజనం కలగనుంది. అసలే ఉత్పత్తి, బిజినెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలకు కేంద్రం పీఎఫ్ చందా జమ చేసే తేదీ గడువు పొడిగించడం వల్ల ఎంతోకొంత లిక్విడిటీ ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. లాక్ డౌన్ నేపథ్యంలో వ్యాపార నష్టాలను దృష్టిలో ఉంచుకొని జమ చేసే గడువును 30 రోజులు పొడిగించినట్లు రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్ బుధవారం నోటిఫికేషన్‌లో తెలిపింది.

కేంద్రం భారీ ఊరట
కంపెనీలు మార్చి నెలకు సంబంధించిన 12 శాతం ఉద్యోగి వాటా, 12 శాతం యజమాని వాటా పీఎఫ్ వాటాలు.. మొత్తం 24 శాతం వాటాను ఏప్రిల్ 15వ తేదీ లోపు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓకు ప్రతి నెల పీఎఫ్, పెన్షన్ కాంట్రిబ్యూషన్‌గా కంపెనీల నుండి రూ.12,000 కోట్ల నుండి రూ.12,500 కోట్లు వస్తాయి.

మరోసారి పొడిగించే అవకాశం
ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కంపెనీలకు భారీ ఊరట కల్పించిందని, మరోసారి కూడా పొడిగించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అప్పుడు కంపెనీలకు రెండు పర్యాయాలు కలిపి రూ.24,000 కోట్ల లిక్విడిటీ వెసులుబాటును కల్పించినట్లవుతుందని చెబుతున్నారు.

పరిస్థితి మారకపోవచ్చు
లాక్ డౌన్‌ను ఇప్పటికే పొడిగించినందున పరిస్థితులు వచ్చే నెల నాటికి కూడా సానుకూలంగా ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. కాబట్టి అప్పటికీ మళ్లీ పొడిగింపే శరణ్యమంటున్నారు. మానవతాదృక్పథంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం అడుగుతోందని, ఇలాంటి సమయంలో కేంద్రం కూడా తన శక్తి మేరకు ఇలాంటి వెసులుబాటు కల్పిస్తోందని అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications