కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా లాక్ డౌన్ విధించారు. దీంతో కార్పోరేట్ కంపెనీల ఆదాయం ఈ కాలంలో 25% క్షీణించింది. వ్యాపార కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడానికి ఏడాది సమయం పడుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. 'కోవిడ్ 19 అండ్ యువర్ వెల్త్' అనే పేరుతో ఆన్‌లైన్ పెట్టుబడుల సంస్థ Scripbox ఈ సర్వే నిర్వహించింది.

ఎంత నష్టం వాటిల్లింది..
లాక్ డౌన్ ప్రభావం వల్ల కార్పోరేట్ కంపెనీలకు ఆదాయపరంగా ఎంత నష్టం వాటిల్లింది, ఆయా కంపెనీల్లో ఎన్ని ఉద్యోగాలు తగ్గించారు తదితర అంశాలపై సర్వే చేసింది. లాక్ డౌన్ సమయంలో తమ కంపెనీల ఆదాయం 25 శాతం తగ్గినట్లు ఈ సర్వేల్లో పాల్గొన్న వ్యాపార యజమానుల్లో 66 శాతం మంది చెప్పారు. లాక్ డౌన్ ఎత్తివేసిన ఏడాది తర్వాత వ్యాపారాలు కుదుటపడవచ్చునని 22 శాతం మంది చెప్పారు. Scripbox ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో 1200 మంది బిజినెస్ లీడర్స్ పాల్గొన్నారు.

సర్వేలో పాల్గొన్న వారు ఇలా..
- ఆదాయం 25% కంటే పైగా పడిపోయిందని సర్వేలో పాల్గొన్న 67% మంది చెప్పారు.
- లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కోలుకోవడానికి ఏడాదికి పైగా పట్టవచ్చునని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు.
- లాక్ డౌన్ వల్ల ఉద్యోగాల కోత కూడా చోటు చేసుకుంది. 25% కంటే ఉద్యోగాల కోత ఉన్నట్లు 90% మంది చెప్పారు. 10% మాత్రం 25% కంటే పైగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. ఎస్ఎంఈ విభాగంలో ఉద్యోగాలపై అధిక ప్రభావం పడిందని చెప్పారు.

దాదాపు ఆదాయమే లేదు..
- ఫ్రీలాన్సర్లపై లాక్ డౌన్ ఎక్కువగా ఉందని ఎక్కువ మంది వెల్లడించారు. 25% శాతం కంటే ఎక్కువ ఆదాయం తగ్గిందని 66 శాతం మంది చెప్పగా, దాదాపు ఆదాయమే లేదని 35% మంది చెప్పారు.
- 1200 మంది బిజినెస్ లీడర్స్‌లలో 54% మంది పెద్ద కార్పోరేట్ కంపెనీలకు చెందిన వారు, 32% మంది స్మాల్ అండ్ మీడియా సైజ్ కంపెనీలకు చెందిన వారు, 14% మంది స్టార్టప్స్ ఉన్నారు.


Click it and Unblock the Notifications