ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న భయంకరమైన కరోనా వైరస్.... అభివృద్ధి చెందిన దేశాలపై అధిక ప్రభావం చూపుతోంది. ఆధునిక యుగంలో తొలితరం పారిశ్రామిక విప్లవానికి కేంద్రమైన యూరోప్ ప్రాంతంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రపంచ పెద్దన్న అమెరికా లో సైతం కరోనా కోరలు చాస్తుండటంతో ఆ దేశాన్నే కాకుండా మొత్తం ప్రపంచాన్నే ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే, ప్రపంచంలోని 90% దేశాలకు అమెరికానే అతిపెద్ద మార్కెట్. అది సుభిక్షంగా ఉంటేనే మిగితా దేశాలు కూడా హ్యాపీగా ఉంటాయి. అదే అమెరికా కు ఏదైనా సమస్య తలెత్తితే దాని ప్రభావం అందరిపైనా పడుతుంది. అందుకే అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుంది అనే సామెత పుట్టుకొచ్చింది.
ప్రస్తుతం మాయదారి కరోనా వైరస్ దెబ్బకు పెద్దన్న అమెరికా విలవిలలాడుతోంది. ఇప్పటికే 2,000 మంది ప్రజలు చనిపోయారు. మరో 1 లక్ష మందికి ఈ వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యుద్ధం కాకుండా ఈ మధ్య కాలంలో అమెరికా లో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మరణాలు నమోదు అయ్యింది కేవలం ఇప్పుడే కావటం గమనార్హం. అమెరికా కానీ, యూరోపియన్ దేశాలు కానీ అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు. వాటి వద్ద తగినంత మంది డాక్టర్లు, హాస్పిటల్స్, ఇతర సదుపాయాలు ఉన్నాయి. కానీ, ఇండియాలో ఆ పరిస్థితి లేదు.

వృద్ధుల సంఖ్య అధికం...
యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం మృత్యు ఘంటలు మోగుతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు అన్ని దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఒక్క ఇటలీ లోనే ఇప్పటి వరకు సుమారు 10,000 మంది ప్రజలు మరణించారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా లో కూడా ఇంత స్థాయిలో మరణాలు సంభవించలేదు. చైనాలో ఈ మహమ్మారి బారిన పడి కేవలం 3,200 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. మరో 80,000 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్పెయిన్, బ్రిటన్, జర్మనీ సహా అన్ని యూరోపియన్ దేశాల్లో ఎంత గొప్ప సదుపాయాలు ఉన్నా... ఒక కామన్ ఫాక్టర్ వాటిని ఇబ్బందికి గురిచేస్తోంది. అదే వృద్ధాప్యం. ఇక్కడ ప్రతి 100 మందిలో 30 మంది వృద్ధులే ఉన్నారు. 65 ఏళ్ళు పైబడిన వారిని యూరోప్ లో వృద్ధులుగా పరిగణిస్తారు. కరోనా వైరస్ 60 ఏళ్ళ పైబడిన వయసున్న వారికి సోకితే ప్రాణాంతకంగా మారుతోంది. అదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారుతోంది. అమెరికా అయినా... యూరోప్ దేశాల్లో అయినా చలి తీవ్రత అధికంగా ఉంటోంది. అక్కడ గరిష్ట ఉషోగ్రత కేవలం 25 డిగ్రీలు మాత్రమే. వాతావరణంలో హ్యూమిడిటీ శాతం కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా వైరస్ వ్యాప్తికి హ్యూమిడిటీ చోదకంగా పనిచేస్తుంది. అందుకే, అక్కడ మరణాల రేటు అధికంగా ఉంటున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో వైపు ఆయా దేశాల్లో న్యూమోనియా వ్యాధితో బాధపడే వృద్ధుల సంఖ్య కూడా అధికం.

ఇటలీ లో 6,000 మంది కి ఒక మరణం...
ఇటలీ సహా యూరోపియన్ దేశాల్లో ప్రతి 1,000 మందికి 3 హాస్పిటల్ బెడ్లు, 1 డాక్టర్ అందుబాటులో ఉన్నారు. అదే అమెరికా లో ఈ సంఖ్య కాస్త తక్కువ అయినా... ప్రతి 1,000 మందికి 2.5 బెడ్లు, అదే స్థాయిలో డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. కానీ, ఇండియా లో మాత్రం ప్రతి 1,200 నుంచి 1,300 మందికి ఒక ఆస్పత్రి బెడ్డు, ప్రతి 1,500 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇండియాలో గనుక తీవ్రత పెరిగితే ఎంత కష్టమో ఒక సారి ఆలోచించాలి. ఇదిలా ఉండగా... ప్రస్తుతం కరోనా వైరస్ ధాటికి ఇటలీ లో ప్రతి 6,000 మందికి ఒకరు మృత్యువాత పడుతున్నారు. ఇది అత్యంత సంక్షోభ సమయం. అదే అమెరికా లో ఐతే ప్రతి 1,50,000 మందికి ఒకరు కరోనా వైరస్ తో మరణిస్తున్నారు. అదృష్టం కొద్దీ మన ఇండియా లో మాత్రం 6.7 కోట్ల మందిలో ఒక్కరు మాత్రమే ఈ మహమ్మారి దెబ్బకు మరణించారు.

ఇండియాలో మొత్తం డాక్టర్లు 12 లక్షలు...
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలం అవుతుంటే... భారత్ మాత్రం కాస్త మెరుగ్గా ఉంది. మొత్తం దేశాన్ని 21 రోజుల పాటు లాక్ డౌన్ చేయటం వల్ల మన ప్రభుత్వాలు దీనిని కట్టడి చేసేందుకు పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందుకే, మన దగ్గర తీవ్రత అదుపులోనే ఉందని చెప్పవచ్చు. లేదంటే, ఇండియా మొత్తంలో చూస్తే కేవలం 12 లక్షల మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. 135 కోట్ల మందికి కేవలం 12 లక్షల మంది వైద్యులు తమ సేవలు అందించడం ఎంత కష్టమో ఆలోచించాలి. అదే కేవలం 30 కోట్ల జనాభా కలిగిన అమెరికా లో కూడా 11 లక్షల కంటే ఎక్కువ మంది డాక్టర్లు ఉండటం గమనార్హం. మరోవైపు ఇండియా లో వృద్ధుల సంఖ్య మొత్తం జనాభాలో కేవలం 10% గా ఉంది. 2026 నాటికి ఇది 12% నికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు మన వద్ద ప్రస్తుతం వేడి వాతారణం ఉండటం కూడా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దోహదపడుతోంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే, మన ఆహారపు అలవాట్లలో అల్లం, వెల్లుల్లి, పసుపు, శొంఠి, మిరియాలు వంటి యాంటీ వైరల్ పదార్థాలు అధికంగా ఉండటం కూడా మనల్ని కాపాడుతున్నాయని పేర్కొంటున్నారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications