For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత ఫార్మాలకు కరోనా వైరస్ దెబ్బ, గ్లోబల్ ఎకానమీపై ప్రభావం

|

కరోనా వైరస్ కారణంగా చైనా ఎకానమీతో పాటు గ్లోబల్ ఎకానమీపై కూడా ప్రభావం పడుతోంది. 2020 క్యాలెండర్ తొలి క్వార్టర్‌లో ప్రపంచ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GDP)పై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేటింగ్ ఏజెన్సీల ప్రకారం తొలి క్వార్టర్‌లో వృద్ధి రేటు 0.7 శాతం తగ్గనుంది. అయితే ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో పుంజుకుంటుందని చెబుతున్నారు. మొత్తంగా 2020లో జీడీపీ గ్రోత్ రేట్ 20 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, భారత ఫార్మా కంపెనీలకు కరోనా భయం పట్టుకుంది. చైనా నుండి మన దేశ కంపెనీలు ఎక్కువగా ఔషధాలలో వినియోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను దిగుమతి చేసుకుంటాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ సరఫరా మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాయి. భారత్ దిగుమతి చేసుకుంటున్న బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంగ్రీడియెంట్స్‌లో చైనా వాటానే అత్యధికంగా ఉంటోంది. 2018-19 దిగుమతుల్లో చైనా వాటాయే 67.56%. ఈ వ్యాల్యూ 240.54 కోట్ల డాలర్లు.

క్రెడిట్ కార్డు తీసుకుంటే వడ్డీ భారం నిజమేనా? 16 కీలక విషయాలు తెలుసుకోండి..క్రెడిట్ కార్డు తీసుకుంటే వడ్డీ భారం నిజమేనా? 16 కీలక విషయాలు తెలుసుకోండి..

Coronavirus: weakest quarter for global growth since GFC

ప్రస్తుత పరిస్థితిని కంపెనీలు పరిశీలిస్తున్నాయని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అందరూ కృషి చేస్తున్నారని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ అన్నారు. ప్రస్తుత పరిణామాలు, క్రిటికల్ ఏపీఐ/ఇంటర్‌మీడియేట్స్, ప్రత్యామ్నాయ వనరుల విశ్లేషణ తదితర అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

English summary

భారత ఫార్మాలకు కరోనా వైరస్ దెబ్బ, గ్లోబల్ ఎకానమీపై ప్రభావం | Coronavirus: weakest quarter for global growth since GFC

With coronavirus getting a tighter grip on the China and impacting world trade, most analysts have started lowering global growth forecasts as measured by the gross domestic product (GDP) for the first quarter of calendar year 2020 (Q1-2020).
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X